Vladimir Putin: రష్యా దేశాధ్యక్షుడిగా పుతిన్ అయిదోసారి ప్రమాణ స్వీకారం
Vladimir Putin: రష్యా దేశాధ్యక్షుడిగా ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ ప్రమాణ స్వీకారం చేశారు. అయిదోసారి ఆయన ఆ బాధ్యతలను చేపట్టారు. మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది.
మాస్కో: రష్యా దేశాధ్యక్షుడిగా ఇవాళ వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ప్రమాణ స్వీకారం చేశారు. అయిదోసారి ఆయన ఆ బాధ్యతలను చేపట్టారు. మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. తన వర్క్ ఆఫీసు నుంచి ప్రత్యేక కారు రైడ్‌లో 71 ఏళ్ల పుతిన్ క్రెమ్లిన్ ప్యాలెస్‌కు వెళ్లారు. రాజ్యాంగానికి చెందిన ఒక ప్రత్యేక కాపీపై ఓ చేయి వేసి దేశానికి సేవ చేయనున్నట్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2020లో జరిగిన సవరణలతో కూడిన రాజ్యాంగ పుస్తకాన్ని ప్రమాణ స్వీకారం వేళ వినియోగించారు. జాతీయ పార్లమెంట్‌కు చెందిన చట్టసభ ప్రతినిధులు, న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్ వలెరి జోర్కిన్ .. పుతిన్ అయిదోసారి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ద్రువీకరించారు. దీంతో మరో ఆరేళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా పుతిన్ కొనసాగనున్నారు. 2000, 2004, 2012, 2018 సంవత్సరాల్లో పుతిన్ ప్రమాణం చేశారు.ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పుతిన్ 87.28 శాతం ఓట్లతో గెలుపొందారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

