డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు.
డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఎమ్మెల్సీకి సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకరమైన వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. తొలుత రూ.5 కోట్లు డిమాండ్ చేసిన నిందితులు ఇప్పటికే రూ.5 లక్షలు వసూలు చేయగా, మరో రూ.5 లక్షల కోసం ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద డబ్బులు తీసుకుంటుండగా నార్సింగి పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేశారు.
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటంతో పాటు త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో 14 మంది నిందితులు ఈ కుట్రకు తెరలేపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయనకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేశారు. వాటి ఆధారంగా అభ్యంతరకరమైన డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించారు. ఈ వీడియోలు బయటకు వస్తే ఆయన రాజకీయ, సామాజిక ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలుగుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని భయపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ విధంగా బాధితుడిపై ఒత్తిడి తెచ్చిన నిందితులు మొదట రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. అనంతరం ఎల్‌డబ్ల్యూ-2 ద్వారా రూ.5 లక్షలు వసూలు చేశారు. అయినప్పటికీ మరింత డబ్బు కోసం వేధింపులు కొనసాగించారు. మరో రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 5న నిందితురాలు ఫాతిమా బేగం అలియాస్ రీమా (ఏ-3), ఏ-10 నుంచి ఏ-13 వరకు ఉన్న మరో నలుగురితో కలిసి ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఎమ్మెల్సీ నుంచి రూ.4 లక్షల నగదు ఉన్న అట్టపెట్టెను స్వీకరించింది. ఈ విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసుల ప్రత్యేక బృందం వెంటనే రంగంలోకి దిగింది. నగదుతో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఫాతిమా బేగంతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఏ-2 మహ్మద్ మొహ్సిన్ ఖాన్‌ను కూడా అరెస్టు చేసింది.
ఆరుగురు నిందితుల అరెస్టు
ఈ కేసులో అరెస్టయిన వారిని మహ్మద్ మొహ్సిన్ ఖాన్ (35), ఫాతిమా బేగం అలియాస్ రీమా (29), మహ్మద్ సమీర్ (20), మహ్మద్ జమీర్ (20), మహ్మద్ ఇమ్రాన్ (18), సయ్యద్ రెహాన్ (20)గా పోలీసులు గుర్తించారు. వీరిలో కొందరు కోళ్ల వ్యాపారం, ఆటో డ్రైవింగ్, వస్త్ర వ్యాపారం చేస్తుండగా, మరికొందరు గృహిణులుగా ఉన్నట్లు తెలిపారు. నిందితులంతా బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, గౌస్ మార్కెట్, బార్కస్ ప్రాంతాలకు చెందినవారని వెల్లడించారు.
ఈ వ్యవహారంలో ఏ-1తో పాటు మరికొందరు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్సీ ఫొటోలను మార్ఫింగ్ చేయడం, డీప్‌ఫేక్ వీడియోలను రూపొందించడం, వాటిని బెదిరింపులకు ఉపయోగించడం వంటి కార్యకలాపాల్లో ఏ-1 పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు ఏ-14తో పాటు పరారీలో ఉన్న కొందరు వివిధ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభ్యంతరకరమైన సమాచారాన్ని ప్రచారం చేయడంలో భాగస్వాములైనట్లు గుర్తించారు.
నిందితుల నుంచి రూ.4.70 లక్షల నగదు, రెండు ఆటోలు, ఆరు సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు బ్లాక్మెయిల్ ద్వారా వసూలు చేసిన మొత్తానికి సంబంధించిందని తెలిపారు. ఈ కుట్రలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరో ఎనిమిది మంది కోసం గాలింపు చేపట్టారు. ఏ-1, ఏ-4 నుంచి ఏ-9 వరకు, ఏ-14తో పాటు మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మార్ఫింగ్ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోల తయారీ వెనుక ఉన్న వ్యక్తులు, వాటిని ప్రచారం చేసేందుకు ఉపయోగించిన సోషల్ మీడియా ఖాతాల వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 1803/2026గా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని 308(5), 336(4), 351(2), 353(2), 61(2) రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

