Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
Rythu Garjana Sabha | ఈ నెల 11న నిర్మల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు గర్జన సభకు పార్టీ నాయకులు సన్నాహాలు ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్మల్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు.
Rythu Garjana Sabha | ఈ నెల 11న నిర్మల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు గర్జన సభకు పార్టీ నాయకులు సన్నాహాలు ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్మల్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రైతు గర్జన సభను విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు, సభా ప్రాంగణంలో చేపట్టాల్సిన సౌకర్యాలు, ఇతర నిర్వహణ అంశాలపై నాయకులు పరిశీలించారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సమన్వయం చేసుకోవాలని చర్చించారు.

Ktr Rythu Garjana Sabha1
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ముధోల్ నియోజకవర్గ సమన్వయకర్తలు లోలం శ్యాంసుందర్, రమాదేవి, కిరణ్ కోమ్రేవార్, విలాస్ గాదేవర్, నిర్మల్ నియోజకవర్గ నాయకుడు నల్ల వినయ్ రెడ్డితో పాటు మూడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BRS
- KTR
- Nirmal
- Rythu Garjana Sabha
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

