Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
Centre earns Rs 970 crore from scrap | కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు అన్ని శాఖల్లో స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించింది. ఆరో విడతలో వ్యర్థాల తొలగింపు ద్వారా రూ.970 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించింది. కేవలం ఎలక్ట్రానిక్ వ్యర్థాల ద్వారానే సుమారు రూ. 50 కోట్లు సమకూరాయి.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు అన్ని శాఖల్లో స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించింది. ఆరో విడతలో వ్యర్థాల తొలగింపు ద్వారా రూ.970 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించింది. కేవలం ఎలక్ట్రానిక్ వ్యర్థాల ద్వారానే సుమారు రూ. 50 కోట్లు సమకూరాయి. (Centre earns Rs 970 crore from scrap ) 2021లో మొదలైన వార్షిక స్వచ్ఛతా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31 వరకు ‘స్పెషల్ క్యాంపెయిన్ 6’ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని సుమారు 19.89 లక్షల ప్రదేశాల్లో క్లీనింగ్ డ్రైవ్ చేపట్టారు. 277.82 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేశారు.
కాగా, ఆరో విడతలో వ్యర్థ పదార్థాలను (స్క్రాప్) విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 970.33 కోట్లు సంపాదించింది. స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కంటే సుమారు 16 శాతం ఎక్కువ అని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యర్థాల అమ్మకం ద్వారా రైల్వే బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ రూ. 618.06 కోట్ల అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. దీని తర్వాత సైనిక వ్యవహారాల శాఖ రూ. 88.96 కోట్లు, బొగ్గు మంత్రిత్వ శాఖ రూ. 61.41 కోట్లు, పెట్రోలియం-సహజ వాయువుల మంత్రిత్వ శాఖ రూ. 34.81 కోట్లు సంపాదించాయి.
మరోవైపు పాఠశాల విద్య శాఖ 7.01 లక్షలకు పైగా పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహించింది. అత్యధిక సంఖ్యలో క్లీనింగ్ డ్రైవ్‌లను చేపట్టింది. దీని తర్వాత మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 6.52 లక్షల అంగన్వాడీ కేంద్రాలు, ఇతర సంస్థలలో పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహించింది.
మంత్రిత్వ శాఖలలోకెల్లా అత్యధికంగా 1.48 కోట్ల చదరపు అడుగులకు పైగా స్థలాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ ఖాళీ చేసింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 50.19 లక్షల చదరపు అడుగులకు పైగా స్థలాన్ని ఖాళీ చేయగా, రక్షణ ఉత్పత్తి విభాగం తన సంస్థల వ్యాప్తంగా 19.34 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేసింది. స్పెషల్ క్యాంపెయిన్ 6 ద్వారా మొత్తం మీద 277.82 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేశారు.
అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు పరిష్కరించడంతోపాటు పెరుకుపోతున్న పాత ఫైల్స్ సంఖ్యను తగ్గించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు 9,99,168 ప్రజా ఫిర్యాదులను, ఫిర్యాదులకు సంబంధించిన 40,878 అప్పీళ్లను పరిష్కరించాయి. 26,79,875 భౌతిక ఫైళ్లను కూడా అధికారులు సమీక్షించారు. వాటిలో 15,76,828 ఫైళ్లను తొలగించారు. పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, కాగితరహిత, పౌర-కేంద్రీకృత పాలన దిశగా పయనించడం వంటి ప్రయత్నాలలో భాగంగా డిజిటల్ విభాగంలో 9,58,864 ఎలక్ట్రానిక్ ఫైళ్లను సమీక్షించారు. 7,01,723 ఫైల్స్‌ను మూసివేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
Surprise Inspections | కొత్తగూడెంలో తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
Indian Railways | దీపావళి వేళ దక్షిణ మధ్య రైల్వే అలర్ట్.. వీటిని రైళ్లలో అస్సలు తీసుకురావద్దంటూ రిక్వెస్ట్!
IPE Director | ఐపీఈ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

