Vastu Shastra | వాస్తు ఇల్లు వల్ల ఆశించినవన్నీ జరుగుతాయా?
‘భవితవ్యం భవిత్యేవ’ జరగాల్సినవి జరుగక మానవు. ‘అయ్యో.. అలాంటప్పుడు వాస్తు ఎందుకు?’ అని అనిపించవచ్చు. వ్యక్తికి ఈ క్షణం అది కష్టం అనిపించినా.. మనకు రావాల్సినవే వస్తాయి. అవి మనకు ఆ తరువాత అర్థం అవుతాయి.
వాస్తు ఇల్లు వల్ల ఆశించినవన్నీ జరుగుతాయా?
– ఎం. చంద్రకళ, ఉప్పల్.
Vastu Shastra | ‘భవితవ్యం భవిత్యేవ’ జరగాల్సినవి జరుగక మానవు. ‘అయ్యో.. అలాంటప్పుడు వాస్తు ఎందుకు?’ అని అనిపించవచ్చు. వ్యక్తికి ఈ క్షణం అది కష్టం అనిపించినా.. మనకు రావాల్సినవే వస్తాయి. అవి మనకు ఆ తరువాత అర్థం అవుతాయి. మీ సంకల్పం మంచిదైతే.. మంచి జరుగుతుంది. చెడ్డదైతే.. చెడు జరుగుతుంది. వాస్తు అనగానే.. ‘నేను ఎంతగా, ఎలా ఉన్నా.. నాకు ఏమీ కాకూడదు. నేను గొప్పగానే ఉండాలి!’ అనుకోవద్దు. పదునైన కత్తి ఎవరు దేనికోసం వాడినా.. అది తెగే లక్షణాన్ని కోల్పోదు. శాస్త్రం అస్త్రంలాంటిది. నన్ను, నిన్నూ వదలదు.

ఒకరి ఇల్లు దోచుకోవాలనుకునేది కూడా ఆశనే. అది ఫలించాలనుకుంటే ఎలా ఫలిస్తుంది. కానీ, తెల్లవారే నీ తప్పు బయటపడేస్తుంది. ఇదే దీని రహస్యం. ప్రకృతి.. ధర్మాన్నే ఆమోదిస్తుంది. కారు గొప్పదైనంత మాత్రాన కాదు.. మన డ్రైవింగ్ కూడా గొప్పగా, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన చేతుల్లోనే ప్రమాదాలు జరుగవచ్చు. మన స్థాయిని బట్టి, అర్హతను బట్టి సంకల్పం (ఆశలు) ఉంటే.. తప్పక అందుతాయి. చేసేది ఏదో వంటపని.. కానీ, తాను పైలెట్‌లా విమానం నడపాలనుకుంటే అవ్వదు. మన సంకల్పాలే మన ఫలితాలు. అవి మన అర్హతను నిర్ణయిస్తాయి. ఇల్లు వాటినే ఆమోదిస్తుంది.
ఈశాన్యంలో పెద్ద హాలు మంచిదేకదా!? డ్రాయింగ్ రూమ్, హాలు కలిపితే తప్పా!?
– కె. మనోజ్, మేడ్చల్.
చాలామంది ఇల్లు కట్టాలనుకోగానే.. పెద్దహాలు ఉండాలని అనుకుంటారు. అందుకని ఇంట్లో డ్రాయింగ్ గదిని ప్రత్యేకంగా ఇవ్వకుండా, హాలులో కలిపి అందరూ కూర్చోవడానికి సోఫాలు వేసి వాడుతుంటారు. ఇలా చాలా విరుద్ధమైన విభజన. ఇంటిని మనం ఇష్టమొచ్చినట్టు చేయడం కాదు. శాస్త్ర సమ్మతంగా మన ఇష్టాన్ని అమలు పరచాలి. కిచెన్ ఆగ్నేయంలో పెట్టాక.. దాని కొలతను అనుసరించి డ్రాయింగ్ రూమ్ సపరేటు అవ్వాలి. హాలు వేరు. డ్రాయింగ్ గది వేరు. ఇంటిని ఒక మానవ ఆకారంగా అనుకొని విభజన చేయాలి. హాలును గర్భస్థానం అంటాము. నోటి భాగం లేకుండా కడపునకు యోగ్యత లేదు. అలాగని కంఠాన్ని – కడుపును కలుపరాదు. రెండిటికీ అనుబంధం ఉన్నా.. దేనికదే సపరేటుగా ఉండాలి. ముందు మీ ఇంటి ప్లాను తెలిసిన వారిచేత.. సరిగ్గా మీ అవసరాలను బట్టి రచన చేయించండి. అప్పుడు మంచి గృహం కట్టగలుగుతారు.

మాకు పడమర ఖాళీ స్థలం ఉన్నది. అందులో ఒక ఓపెన్ కిచెన్, ఒక స్టోర్ కట్టొచ్చా? ఎక్కడ, ఏది, ఎలా కట్టాలి?
– వి. రాజు, చేర్యాల.
పడమర ఎక్కువ ఖాళీ భాగం ఉంది అంటే.. మీరు ఇంటి ఆవరణను సరిగ్గా విభజించలేదు అని అర్థం చేసుకోవాలి. పడమర మీకు కిచెన్ కావాలి అంటే.. వాయవ్యంలో కిచెన్ వచ్చేలా ప్లాన్ చేయండి. అయితే, ఇంటిని ఆనుకోకుండా నాలుగు లేదా పది అడుగుల దూరంలో పడమర పైపు ఇంటి ఉత్తర – దక్షిణం కొలతనుబట్టి పెద్ద హాలు వేయండి. దానిలో నైరుతి భాగం ఒక పెద్ద స్టోర్ రూమును ఏర్పాటు చేసి, మధ్యలో డైనింగ్ పెట్టి, వాయవ్యంలో కిచెన్ నిర్మించండి. తద్వారా దానికది పడమర భాగాన్ని పటిష్ఠపరుస్తుంది. ఉపయోగంలోకి వస్తుంది. ఇంటిని, పాకను కలుపకుండా ప్లాన్ చేయాలి. ఇల్లు – పాక (హాల్) కలిపివేస్తే.. అనేక సవరణలు చేయాల్సి వస్తుంది. పడమర దోషాన్ని సవరించడానికి ఇది ఒక మార్గం. అంతే! లేదంటే ఆ స్థలాన్ని వదిలి మరో ప్రహరీ కట్టుకొని, ఆ స్థలాన్ని శాశ్వతంగా వదిలేయాలి.
ఇంటికి ఉత్తరంలో లిఫ్ట్ పెట్టి, దానికి రెండువైపులా ద్వారాలు పెట్టొచ్చా? ఉత్తర ద్వారమే అవుతుంది కదా!?
– కె. మునిస్వామి, కోరుట్ల.
ఉత్తరంలో లిఫ్ట్ పెట్టరాదు అంటే.. ఆ లిఫ్ట్‌ను కేవలం ఇంటిలోనుంచి మాత్రమే వాడుకోవాలి. లేదు దానిని బయటినుంచి కామన్ లిఫ్ట్‌గా వాడతాము అంటే మంచిది కాదు. ఉత్తరం తెగిపోతుంది. అలా కాకుండా ఆ లిఫ్ట్‌కు రెండు పక్కలా ద్వారాలు పెడుతున్నాం అంటే, సింహద్వారం కాదు.. అలా పెట్టుకోవడానికి. మీరు పెట్టే స్థానాన్ని బట్టి అది వాయవ్యం ద్వారం కూడా కావచ్చు.

ఇల్లు.. వ్యాపార స్థానం కాదు. మన ఇష్టానుసారం నిర్ణయించడానికి. మీరు ఆ లిఫ్ట్‌ను కామన్‌గా వాడాలనుకుంటే, బయట తూర్పు – ఆగ్నేయంలో లేదా ఉత్తర – వాయవ్యంలో పెట్టండి. కాదు.. ఇంటివాళ్లకే ఇంటర్నల్ అనుకుంటే, బయటినుంచి కాకుండా, ఇంటిలో తూర్పు – ఉత్తరం, పడమర – దక్షిణంలో కూడా పెట్టి వాడండి. అన్నీ తెలుసుకొని లిఫ్ట్ స్థానం నిర్ణయించాలి.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

