Vaishali Raj | అచ్చ తెలుగమ్మాయిని.. ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా: వైశాలీ రాజ్
నిజానికి అనుకోని పరిస్థితుల్లో నటనవైపు వచ్చాను. ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. నాలోని నటిని గుర్తించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. హీరోయిన్‌గానే కాకుండా అభినయానికి ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే.
Vaishali Raj | తెలుగు సినీ పరిశ్రమలో ఉత్తరాది అమ్మాయిల హవాయే ఎక్కువ. అరకొరగా తెలుగమ్మాయిలు తెరపై కనిపించినా సక్సెస్ రేటు అంతంత మాత్రమే. అలాంటి పరిస్థితిలోనూ వరుస అవకాశాలతో విజయవంతంగా రాణిస్తున్న తెలుగమ్మాయి వైశాలీ రాజ్. సోషల్ మీడియా, షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ మొదలుపెట్టి వెండితెరపై ఛాన్స్ కొట్టేసిన వైశాలి మొదటి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘కనబడుటలేదు’ అంటూ తెరపై మెరిసిన వైశాలి ఇటీవల విడుదలైన ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా’ సినిమాతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పదహారణాల అచ్చ తెలుగమ్మాయి వైశాలి గురించి మరిన్ని కబుర్లు..
నిజానికి అనుకోని పరిస్థితుల్లో నటనవైపు వచ్చాను. ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. నాలోని నటిని గుర్తించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. హీరోయిన్‌గానే కాకుండా అభినయానికి ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే.
హీరోయిన్గా ‘కనబడుటలేదు’ నా తొలి చిత్రం. కానీ ఆ సినిమా కంటే ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాను. మొదటి సినిమాలోనే సునీల్ వంటి సీనియర్ యాక్టర్‌తో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. నా స్క్రీన్ నేమ్ వైశాలి రాజ్ కానీ, నా అసలు పేరు కవిత కోన. మాది వైజాగ్. పుట్టి పెరిగింది, చదివిందీ వైజాగ్‌లోనే.
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో దీపికా పదుకొణె, నయనతార, సమంత అంటే ఇష్టం. వారు ఎంపిక చేసుకునే పాత్రలు బాగా నచ్చుతాయి. ఈ విషయంలో వాళ్లను స్ఫూర్తిగా తీసుకుంటా. ప్రస్తుతానికి కొన్ని కథల్ని వింటున్నా. ఎలాంటి నేపథ్యంలోనైనా నటించాలనుంది కానీ కథంతా నా చుట్టూనే తిరగాలి.
షార్ట్ ఫిల్మ్స్, సీరియళ్లలో నటించడం వల్ల సన్నివేశాలు తెరకెక్కించడంలో కొంత అనుభవం వచ్చింది. కెమెరా ఎక్కడ పెట్టాలి? క్లోజ్ షాట్ ఉంటే నటులు ఎక్కడ ఉండాలి? తదితర అంశాలు నేర్చుకున్నాను. దాంతో నాలో దర్శకత్వ లక్షణాలున్నాయని చాలా మంది అన్నారు. దర్శకత్వంపైనా మక్కువ ఎక్కువ. భవిష్యత్తులో దర్శకురాలిగా మారి మంచి సినిమాను రూపొందించాలనుకుంటున్నా.
నా అభిమాన గాయకుడు సిద్ శ్రీరామ్. ఆయన పాటలంటే చాలా ఇష్టం. ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా’ లో సిద్ శ్రీరామ్ పాడిన పాటలో నేను కనిపించడం నిజంగా థ్రిల్ కలిగించింది.
చదువు పూర్తవగానే ఉద్యోగంలో చేరిపోయా. నాన్న చనిపోవడంతో ఉద్యోగం మానేసి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించడం ప్రారంభించా. ఓ షార్ట్ ఫిల్మ్‌లోని ఫొటో చూసి ‘కనబడుటలేదు’ దర్శకుడు బాలరాజు గారు ఆ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నా. తెలుగమ్మాయి అయిన నన్ను ప్రేక్షకులు కచ్చితంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

