Sunita Williams: స్టార్‌లైనర్ ప్రయోగం నిలిపివేత.. సునితా విలియమ్స్ స్పేస్జర్నీకి బ్రేక్
Sunita Williams: సునితా విలియమ్స్ స్పేస్జర్నీకి బ్రేక్ పడింది. మూడోసారి చేపట్టాల్సిన నింగి ప్రయాణం రద్దు అయ్యింది. స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ ప్రయోగాన్ని నిలిపివేశారు. త్వరలో మళ్లీ కొత్త తేదీని ప్రకటించనున్నారు.
న్యూఢిల్లీ: ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్(Sunita Williams) నింగి యాత్రకు బ్రేక్ పడింది. బోయింగ్ స్టార్‌లైనర్ ప్రయోగాన్ని చివరి నిమిషంలో ఆపేశారు. దీంతో మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు రెఢీ అయిన సునితా విలియమ్స్ ప్రయాణానికి బ్రేక్ పడింది. అయితే ఈ ప్రయోగానికి చెందిన కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నారు. అట్లాస్ వి రాకెట్‌లోని సెకండ్ స్టేజ్‌లో ఉండే ఆక్సిజన్ వాల్వ్ లీకేజీ కావడంతో ప్రయోగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 4 నిమిషాలకు ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ లాంచింగ్ స్టేషన్ నుంచి స్టార్‌లైనర్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. కానీ వ్యోమనౌక లిఫ్ట్ ఆఫ్ కావడానికి రెండు గంటల ముందే నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఆక్సిజన్ వాల్వ్ లీక్ కావడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు బోయింగ్ సంస్థ ప్రకటించింది. సునితా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రోనాట్ బారీ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉన్నది.
సునితా విలియమ్స్ ఇప్పటికే రెండు సార్లు స్పేస్ జర్నీ చేశారు. ఆ ఆస్ట్రోనాట్ నింగిలో 322 రోజులు గడిపారు. ఎక్కువ సమయం స్పేస్‌వాక్ చేసిన మహిళా ఆస్ట్రోనాట్‌గా ఆమెకు గుర్తింపు ఉన్నది. తొలిసారి డిసెంబర్ 9, 2006లో ఆమె స్పేస్జర్నీ చేశారు. మొదటిసారి ఆమె జూన్ 22, 2007 వరకు స్పేస్ స్టేషన్లో ఉన్నారు. ఆ తర్వాత రెండో సారి జూలై 14 నుంచి నవంబర్ 18, 2012 వరకు ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

