CSIR | ప్రతి సోమవారం ముడతల దుస్తులే వేసుకోండి.. ఉద్యోగులకు సీఎస్ఐఆర్ సూచన
CSIR | ఆఫీసులకు వెళ్తున్నామంటే చాలు చాలామంది ఇస్ట్రీ చేసిన దుస్తులనే వేసుకుంటారు. మరికొందరు అయితే ఫార్మల్స్, ఇన్‌షర్ట్, టై, షూ ఇలా ప్రొఫెషనల్‌గా రెడీ అయి వెళ్తుంటారు. అలాంటిది ఇస్త్రీ లేకుండా ముడతలు పడ్డ దుస్తులను వేసుకుని రావాలని ఆఫీసులే చెబుతుంటే ఎలా ఉంటుంది.
CSIR | ఆఫీసులకు వెళ్తున్నామంటే చాలు చాలామంది ఇస్ట్రీ చేసిన దుస్తులనే వేసుకుంటారు. మరికొందరు అయితే ఫార్మల్స్, ఇన్‌షర్ట్, టై, షూ ఇలా ప్రొఫెషనల్‌గా రెడీ అయి వెళ్తుంటారు. అలాంటిది ఇస్త్రీ లేకుండా ముడతలు పడ్డ దుస్తులను వేసుకుని రావాలని ఆఫీసులే చెబుతుంటే ఎలా ఉంటుంది. ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ సెర్చ్ (సీఎస్ఐఆర్) ఇదే నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం రోజు ముడతలు పడ్డ దుస్తులనే వేసుకురావాలని ఉద్యోగులకు సూచించింది. ఈ మేరకు వాహ్ మండేస్ (Wah Mondays )ను ప్రారంభించింది. wrinkles Acche hai (ముడతలు మంచివే ) అనే నినాదం కూడా ఇచ్చింది.
ఇదేంటి ఎవరైనా ఆఫీసులకు డీసెంట్‌గా రావాలని చెబుతారు.. ఇలా ముడతలు పడ్డ దుస్తులను ఎందుకు వేసుకురమ్మని ఆలోచిస్తున్నారా! ఇదేదో ట్రెండ్ అవ్వాలని తీసుకున్న నిర్ణయం కాదు. దీనివెనుక పెద్ద సామాజిక కోణమే ఉంది. పర్యావరణ హితం కోసమే ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నామని సీఎస్ఐఆర్ మహిళా డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. కలై సెల్వి వెల్లడించారు. సాధారణంగా ఒక జత దుస్తులను ఐరన్ చేసినప్పుడు 200 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని ఆమె చెప్పారు. దానిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారం పొడవునా కాకుండా కనీసం ఒక్క రోజు అయినా ఇలా ఇస్త్రీ లేని దుస్తులను ధరించేలా వాహ్ మండేస్ స్కీమ్ తీసుకొచ్చామని చెప్పారు. ఇంధన అక్షరాస్యతలో భాగంగా విద్యుత్ వినియోగాన్ని 10 శాతం తగ్గించడంపై కూడా సీఎస్ఐఆర్ దృష్టి సారించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

