Student Murder | ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య..!
Student Murder | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీలో భారత్‌కు చెందిన నవజీత్ సంధూ అనే 22 ఏళ్ల విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. సాటి విద్యార్థులే అతడిని దారుణంగా కత్తితో పొడిచి చంపారు. విద్యార్థుల మధ్య జరిగిన గొడవే అతని హత్యకు దారితీసింది.
Student Murder : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీలో భారత్‌కు చెందిన నవజీత్ సంధూ అనే 22 ఏళ్ల విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. సాటి విద్యార్థులే అతడిని దారుణంగా కత్తితో పొడిచి చంపారు. విద్యార్థుల మధ్య జరిగిన గొడవే అతని హత్యకు దారితీసింది. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన నవజీత్ సంధూ 2022 నవంబర్‌లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లి చదువుకుంటున్నాడు. ఇంతలో ఇలా ప్రాణాలు కోల్పోయాడు.
హర్యానా రాష్ట్రానికే చెందిన ఇద్దరు సోదరుల మధ్య జరిగిన గొడవ పెద్దదై తన కొడుకు ప్రాణాల మీదికి తెచ్చిందని నవజీత్ తండ్రి జితేందర్ సంధూ చెప్పారు. తమకు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో నవజీత్ మిత్రులు ఫోన్ చేశారని, నవజీత్ మరణించాడని చెప్పారని అన్నారు. నవజీత్ తోటి విద్యార్థులే గొడవపడి మధ్య అడ్డుకోబోయిన తన కొడుకును చంపేశారని విలపించారు.
శ్రావణ్‌కుమార్ అనే విద్యార్థి తన రూమ్మేట్స్తో గొడవపడి నవజీత్ ఫ్లాట్‌కు వెళ్లాడని, తర్వాత అతని రూమ్మేట్కు ఫోన్ చేసి బయటికి రావాలని డిమాండ్ చేశారని, దాంతో శ్రావణ్ తనకు తోడుగా రమ్మనడంతో నవజీత్ వెళ్లాడని జితేందర్ సంధూ తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణ్‌పై కత్తితో దాడి చేస్తున్న వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా నవజీత్ పొడిచారని వెల్లడించారు.
కాగా, నవజీత్‌ను పొడిచిన అనంతరం నిందితులు పారిపోయారని, వాళ్ల కోసం గాలిస్తున్నామని మెల్బోర్న్ పోలీసులు చెప్పారు. నిందితులు నవజీత్ ఛాతిపై మూడు సార్లు పొడిచారని తెలిపారు. కాగా తన కొడుకు మృతదేహాన్ని సాధ్యమైనంత తొందరగా భారత్‌కు రప్పించాలని జితేందర్ సంధూ భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

