Knife Attack: చైనా ఆస్పత్రిలో కత్తితో దాడి.. 10 మంది మృతి, 20 మందికి గాయాలు
Knife Attack: చైనా హాస్పిటల్లో నైఫ్ అటాక్ జరిగింది. ఆ దాడిలో 10 మంది మృతిచెందారు. డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. యూనన్ ప్రావిన్సులో ఉన్న జిన్జియాంగ్ కౌంటీలో ఈ అటాక్ జరిగింది.
బీజింగ్: చైనాలోని యూనన్ ప్రావిన్సులో ఉన్న ఓ ఆస్పత్రిలో కత్తి దాడి(Knife Attack) జరిగింది. ఆ ఘటనలో పది మంది మృతిచెందారు. డజన్ సంఖ్యలో జనం గాయపడ్డారు. ఆస్పత్రిలో విధ్వంసకర ఘటన చోటుచేసుకున్నట్లు చైనా మీడియా తెలిపింది. జిన్జియాంగ్ కౌంటీలోని స్థానిక ఆస్పత్రిలో ఈ సంఘటన జరిగింది. దాడికి చెందిన పలు వీడియోలు రిలీజ్ అయ్యాయి. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనాలో తుపాకులపై నిషేధం ఉన్నది. దీంతో అక్కడ కత్తి పోటు దాడులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. గత ఏడాది గ్యాంగ్డాంగ్ స్కూల్లో జరిగిన దాడిలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. 2020లో ఓ స్కూల్లో జరిగిన అటాక్‌లో 37 మంది చిన్నారులు గాయపడ్డారు. యునన్ ప్రావిన్సులో 2014లో కూడా కత్తి అటాక్ ఝరిగింది. రాజధాని కున్మింగ్లో జరిగిన ఘటనలో 33 మంది మృతిచెందగా, 133 మంది గాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

