Deepika Padukune | బాలీవుడ్ క్యూట్ కపుల్లో ఒకరైన రణ్వీర్ సింగ్ – దీపికా పదుకుణె మధ్య చెడిందా? ఇద్దరూ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారా? ఈ న్యూస్ ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్‌మీడియాలోనూ దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది.
రణ్వీర్ సింగ్, దీపికా పదుకుణె ఎప్పుడు అన్యోన్యంగానే కనిపిస్తారు కదా.. వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు రావడమేంటి? అని షాకవుతున్నారా? దీని వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే.. రణ్వీర్ సింగ్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నుంచి తమ పెండ్లి ఫొటోలను డిలీట్ చేశారు. దీంతో ఫ్యాన్స్‌లో లేనిపోని అనుమానాలు మొదలయ్యాయి. గతంలో చాలామంది స్టార్ కపుల్ ఇలాగే విడాకులు తీసుకోవడానికి ముందు తమ సోషల్‌మీడియా ఖాతాల నుంచి ఫొటోలను డిలీట్ చేశారు. దీంతో రణ్వీర్- దీపిక కూడా ఇలాగే విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జోరందుకుంది. కానీ వీళ్ల డివోర్స్ విషయంలో క్లారిటీ అయితే లేదు.
ఎందుకంటే.. దీపిక ఇన్‌స్టాలో పెండ్లి ఫొటోలు డిలీట్ కాలేదు. రణ్వీర్ సింగ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెండ్లి ఫొటోలు మాత్రమే డిలీట్ అయ్యాయి. దీపికతో కలిసి ఉన్న మిగతా ఫొటోలు అలాగే ఉన్నాయి. దీంతో ఏదో పొరపాటు జరిగి ఫొటోలు డిలీట్ అయి ఉంటాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పైగా ఇప్పుడు దీపిక ప్రెగ్నెన్సీతో ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో విడాకుల నిర్ణయం తీసుకుంటారని ఫ్యాన్స్ అనుకోవడం లేదు. ఏదేమైనా వీళ్ల విడాకుల రూమర్స్‌పై క్లారిటీ రావాలంటే రణ్వీర్ – దీపిక ఎవరో ఒకరు స్పందించాల్సిందే.!