గురువారం 04 జూన్ 2020
Karimnagar - Jan 23, 2020 , 02:35:45

ఆఖరి రోజూ ప్రచారహోరుc

ఆఖరి రోజూ ప్రచారహోరుc


మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజూ అట్టహాసంగా సాగింది. బుధవారం సాయంత్రం 5గంటల వరకు నగరంలో హోరెత్తింది. అన్ని డివిజన్లలో టీఆర్ అభ్యర్థులు భారీ ర్యాలీలు తీశారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. జ్యోతినగర్, భాగ్యనగర్, కమాన్ టవర్ సర్కిల్ ఏరియాల్లో మంత్రి గంగుల కమలాకర్ రోడ్ నిర్వహించి, మాట్లాడారు. అభివృద్ధిని చూసి ఓటెయ్యాలనీ, కారు గుర్తుకు ఓటేస్తే కేసీఆర్ సారును ఆశీర్వదించినట్లేనని చెప్పారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ టీఆర్ 7, 8 వ డివిజన్లలో ప్రచారం చేశారు.

- 33వ డివిజన్ భగత్ జడ్పీ క్వార్టర్స్, సంజీవయ్యనగర్ టీఆర్ అభ్యర్థి వై సునీల్ ఇంటింటా ప్రచారం చేశారు. 53వ డివిజన్ టీఆర్ అభ్యర్థి తుల శ్రీదేవి నిర్వహించిన ర్యాలీలోనూ పాల్గొన్నారు.
- 56వ డివిజన్ టీఆర్ అభ్యర్థి వంగపల్లి రాజేందర్ ర్యాలీగా వెళ్లి ప్రచారం నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ ఓట్లు అభ్యర్థించారు. టీఆర్ నాయకులు ఆకారపు భాస్కర్ గోలి రవి, రవీందర్ పాల్గొన్నారు.
- 18వ డివిజన్ టీఆర్ అభ్యర్థి నందెల్లి మధుహ, మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాశ్ జోరుగా ప్రచారం చేశారు. పొన్నాల తిరుపతి, మహమ్మద్, ఖలీఫా, చాంద్, ఇంతియాజ్, అస్తపురం నర్స య్య, అనిల్ పాల్గొన్నారు.
- 19వ డివిజన్ టీఆర్ అభ్యర్థి గోలి కిష్టయ్య ప్రచారం చేశారు. తిరుపతి, అంజన్ పాల్గొన్నారు.
- 21వ డివిజన్ టీఆర్ అభ్యర్థి జంగిల్ సాగర్ తరఫున మంత్రి గంగుల సతీమణి రజిత ఇంటింటా ఓట్లు అభ్యర్థించారు.  కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. 

- 41వ డివిజన్ టీఆర్ అభ్యర్థి బండారి వేణు భారీ ర్యాలీ తీశారు. నాయకులు బిట్టు, సాగర్, తిరుపతి పాల్గొన్నారు. 
- 47వ డివిజన్ టీఆర్ అభ్యర్థి మంద నగేశ్ ముదిరాజ్ మద్దతుగా మంత్రి గంగుల కమలాకర్ పాత బజార్, షాషా మహల్, గాయత్రీనగర్ ప్రచారం నిర్వహించారు.
- 42వ డివిజన్ టీఆర్ అభ్యర్థి మేచినేని వనజ అశోక్ చివరిరోజు తన కార్యాలయం నుంచి భారీ ర్యాలీ తీశారు. 
- 9వ డివిజన్ టీఆర్ అభ్యర్థి కట్ల విద్యసతీశ్ ర్యాలీ తీసి, ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 
- 7వ డివిజన్ టీఆర్ అభ్యర్థి ఆకుల పద్మ ప్రకాశ్ హౌసింగ్ కాలనీలో భారీ ర్యాలీ తీశారు. సదాశివపల్లిలోనూ ప్రచారం సాగించి, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

- 10వ డివిజన్ టీఆర్ అభ్యర్థి నలువాల రవీందర్ రాంపూర్ భారీ ర్యాలీగా వెళ్లి, ప్రచా రం నిర్వహించారు. 
- 14వ డివిజన్ టీఆర్ అభ్యర్థి దిండిగా ల మహేశ్ సప్తగిరికాలనీలో భారీ ర్యాలీ తీశారు.  శ్రీనివాస్ రాజు, అనిల్ ఉన్నారు.
- 17వ డివిజన్ టీఆర్ అభ్యర్థి కోల భాగ్యలక్ష్మిప్రశాంత్  300 బైక్ భారీ ర్యాలీ తీశారు. ర్యాలీ విద్యానగర్, శ్రీరాంనగర్ కాలనీ, కొత్త యాస్వాడ, హరిహరనగర్, సంతోశ్ కుర్మవాడ మీదుగా సాగింది. తమకు ప్రజలందరు మద్దతు ఇవ్వాలని కోరారు. 
- 59వ డివిజన్ టీఆర్ అభ్యర్థి గందె మాధవిమహేశ్ జ్యోతినగర్ ప్రాంతంలో ర్యాలీ చేపట్టారు.  మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని, అత్యధిక మెజార్టీతో మాధవిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
- 51వ డివిజన్ టీఆర్ అభ్యర్థి, మాజీ మేయర్ రవీందర్ విసృత్త ప్రచారం చేశారు. నాయకులు హరిప్రసాద్, రాము పాల్గొన్నారు.
- 8వ డివిజన్ టీఆర్ అభ్యర్థి సల్ల శారదరవీందర్ తరఫున ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్  ఇంటింటి ప్రచారం సాగించారు. భారీ ర్యాలీ తీశారు
- 8వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి కాల్వ స్వప్న మల్లేశం భారీ ర్యాలీ తీశారు. ఇంటింటి ప్రచారం చేశారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి, గెలింపిం చాలని కోరారు.

- 39వ డివిజన్ టీఆర్ అభ్యర్థి కొండపల్లి సరితసతీశ్ భారీ ర్యాలీ నిర్వహించి, ప్రచారం చేశారు.  శివారెడ్డి, అనిల్, అజయ్, రాజన్న, రేణు క, లత, కవిత, శేఖర్, రమణ, కార్తీక్, మారుతి, మధు, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
- 16వ డివిజన్ టీఆర్ అభ్యర్థి బోనాల శ్రీకాంత్ భారీ ర్యాలీగా వెళ్లి, ఇంటింటా ప్రచారం చేశారు. మహిళలు, యువకులు వెంట ఉన్నారు.
- 34వ డివిజన్ ఆమ లతఆనంద్ డప్పు చప్పుళ్లతో ఇంటింటా ప్రచారం సాగించారు. తనను గెలిపించాలని కోరారు.
- 57వ డివిజన్ టీఆర్ అభ్యర్థి న్యాలకొండ పద్మజనారాయణరావు  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, డివిజన్ సమస్యలపై తమకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందనీ, పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ సుధాకర్ ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ స్థానికులు దత్తస్వామి పాల్గొన్నారు.
- 44వ డివిజన్ టీఆర్ అభ్యర్థి బైరం రాజేశ్వరి పద్మయ్య భారీ ర్యాలీ చేపట్టి ఇంటింటా ప్రచారం  చేశారు.  టీఆర్ నాయకులు కొరివి వేణుగోపాల్, ఉదారపు మారుతి, దొంత కనుకయ్య, అన్సారీఅహ్మద్, శ్రీనివాస్ సురేందర్, హరికృష్ణ, అంజన్న, కాలనీప్రజలు పాల్గొన్నారు.
- 46వ డివిజన్ టీఆర్ అభ్యర్థి వంగల శ్రీదేవి ర్యాలీ నిర్వహించి, ప్రచారం సాగించారు. మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని, కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు.


logo