Work From Traffic | ఐటీ రాజధానిలో టెకీ కష్టాలు.. ట్రాఫిక్‌లో ఆన్లైన్ మీటింగ్.. వైరలవుతున్న వీడియో
Work From Traffic | సిలికాన్ వ్యాలీ (Silicon Valley)గా పేరుగాంచిన దేశ ఐటీ రాజధాని బెంగళూర్‌లో ట్రాఫిక్ కష్టాల (Bengaluru Traffic) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
Work From Traffic | సిలికాన్ వ్యాలీ (Silicon Valley)గా పేరుగాంచిన దేశ ఐటీ రాజధాని బెంగళూర్‌లో ట్రాఫిక్ కష్టాల (Bengaluru Traffic) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకూ నగరంలో ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెకీల ట్రాఫిక్ కష్టాలు అంతాఇంతా కాదు.
తాజాగా ఓ టెకీ రద్దీగా ఉన్న రోడ్లపై స్కూటీపై వెళ్తూ మొబైల్ ఫోన్లో జూమ్‌కాల్ వింటున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మహిళ ఆన్లైన్ మీటింగ్‌లో నిమగ్నమై ఉన్నట్లు వీడియోలో కనిపించింది (Woman Attending Online Meeting On Scooter). ఇది చూసిన స్థానికులు వెంటనే ఈ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘వర్క్ ఫ్రం ట్రాఫిక్ (Work From Traffic).. బెంగళూరులో ఓ సాధారణ రోజు’ అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ‘బెంగళూరులోనే ఇలాంటివి సాధ్యం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, ఈ సిలికాన్ సిటీలో ట్రాఫిక్ కష్టాలకు అద్దం పట్టే ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకం వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. ఇక సెలవుల సమయంలో చెప్పాల్సిన పనేలేదు. సొంతూళ్లకు వెళ్లే నగర వాసులు సొంత వాహనాలతో రోడ్లపైకి రావడంతో మహానగరం మొత్తం ఎక్కిడకక్కడ స్తంభించిపోతుంటుంది. సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌ను తప్పించుకునేందుకు అనేకమంది నగర వాసులు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను అనుసరిస్తుంటారు. నగరంలోని 95 శాతం మంది వాహనాల యజమానులు కూడా ఇదే చెబుతున్నారని ఇటీవలే నిర్వహించిన పలు సర్వేల్లోనూ వెల్లడైంది.
சாலையிலும் வேலை
வேற என்ன பண்றதுஅது சரி
சிக்னல பாருங்கடாண்ணா
இவனுங்க எதுக்கு என்னையே பார்த்துக்கொண்டு இருக்கிறானுங்கள் pic.twitter.com/CiMo58flEQ— SHAAN SUNDAR 🖤♥️🖤♥️ (@Sun46982817Shan) April 23, 2024
Also Read..
Massive fire | పాట్నాలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
Election Commission | మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ అసహనం.. రెండు పార్టీలకూ నోటీసులు
Jio Cinema | జియో సినిమా బంపర్ ఆఫర్.. రూ.29కే నెల మొత్తం 4K వీడియో క్వాలిటీతో యాడ్ ఫ్రీ కంటెంట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

