మహిళలు – హ్యాండ్బ్యాగులది విడదీయరాని బంధం! తెలిసిన ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ లైఫ్‌స్టయిల్ బ్రాండ్ టూమీ.. ‘అస్రా’ పేరుతో సరికొత్త హ్యాండ్‌బ్యాగులకు రూపకల్పన చేసింది. నైలాన్‌తో తయారుచేయడం వల్ల ఈ బ్యాగులు ఎక్కువకాలం మన్నుతాయి. మెటాలిక్ లెదర్ ఫినిషింగ్‌తో అందంగానూ కనిపిస్తాయి. ఎలాంటి ఔట్ఫిట్కైనా నప్పుతాయి.
ఇందులో రెండు ప్రధాన కంపార్ట్మెంట్లతోపాటు సెల్‌ఫోన్, సన్ గ్లాసెస్ పెట్టుకోవడానికీ ప్రత్యేకంగా కంపార్ట్మెంట్ను ఏర్పాటుచేశారు. అంతేకాదు.. వీటి బరువు కేవలం 400 గ్రాములు మాత్రమే! మూడు సైజుల్లో, నాలుగు రంగుల్లో ‘అస్రా’ బ్యాగులను సంస్థ అందుబాటులో ఉంచింది. ఐదేండ్ల వారంటీతో వస్తున్న ఈ బ్యాగుల ధర రూ.45,000. tumi.in ద్వారా ఆర్డర్ ఇవ్వవచ్చు.