Weekly Horoscope | ఈ వారం రాశి ఫలాలు.. సెప్టెంబర్ 07నుంచి 13 వరకు
ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. భూ వ్యవహారాలు ఇబ్బంది కలిగించవచ్చు. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది.
మేషం
ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. భూ వ్యవహారాలు ఇబ్బంది కలిగించవచ్చు. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు అనుకూల వారం. పరిచయాలతో పనులు నెరవేరుతాయి. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
వృషభం
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యనిర్వహణలో సంయమనం అవసరం. పనిచేసే విధానంలో మార్పువల్ల అభివృద్ధి కలుగుతుంది. పాతబాకీలు వసూలు అవుతాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. భూ లావాదేవీలు కలిసివస్తాయి. శివారాధన శుభప్రదం.
మిథునం
వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహంతో పనులు నెరవేరుతాయి. సత్ఫలితాలను పొందుతారు. మంచి అవకాశాలు వస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది. అనుకున్న డబ్బు ఆలస్యంగా చేతికి అందడంతో, ప్రత్యేకమైన పనులు వాయిదా పడవచ్చు. వారాంతంలో పరిస్థితులు సానుకూలం అవుతాయి. రామాలయాన్ని సందర్శించండి.
కర్కాటకం
ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉల్లాసంగా ఉంటారు. పిల్లల చదువు విషయంలో కలిసివస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాల వల్ల కార్యసిద్ధి ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. స్థిరాస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
సింహం
కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. పురాణ ప్రవచనాలకు హాజరవుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సూర్యారాధన వల్ల శుభం జరుగుతుంది.
కన్య
శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాల్లో స్వల్ప ఆటంకాలు రావచ్చు. రెట్టింపు శ్రమ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. వ్యాపార భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు. బంధువర్గంతో ఆప్యాయంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులపై మనసు నిలుపుతారు. శ్రమకు తగిన ఫలం పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
తుల
న్యాయ సమస్యలు తీరుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుగురికి సహాయపడే మనస్తత్వం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అయితే తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. భూ వ్యవహారం లాభిస్తుంది. కొంత సంయమనం అవసరం. హనుమత్ ఆరాధన శుభప్రదం.
వృశ్చికం
తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. కోర్టు సమస్యలు తీరుతాయి. రుణబాధలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. నిరుత్సాహం లేకుండా పనులను పూర్తిచేయడంపై మనసు నిలపండి. లలితాదేవి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు
సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. రోజువారీ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెద్దల సూచనలు పాటించడం అవసరం. శుభకార్యాల ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. విద్యార్థులకు అనుకూల సమయం. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. శివాలయాన్ని సందర్శించండి.
మకరం
పనిలో బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. న్యాయ సమస్యలు తీరుతాయి. రాజకీయ ప్రభుత్వ పనులలో ఖర్చులు ఉంటాయి. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. భూ వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. సహోద్యోగులతో భేదాభిప్రాయాలు రావచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
కుంభం
ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. వృథా ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. పిల్లల చదువు, వివాహం, శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. సత్ఫలితాలను పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహం పెరుగుతుంది. వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఇష్టదైవాన్ని పూజించండి.
మీనం
సమయ పాలన లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రయాణాలు కలిసివస్తాయి. బంధుమిత్రుల సహకారంతో కార్యసాఫల్యం ఉంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలను చేపడతారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. బాధ్యతతో మెలగడం అవసరం. పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Namaste effect | గౌతమ్‌పూర్ గ్రామంలో చేతిపంపునకు మరమ్మతులు
Dhirendra Shastri: కృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై క్రిమినల్ కేసు
Theft cases | ఖిల్లా ఘనపూర్ మండలంలో వరుస దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు
Pawan Kalyan | సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ దూరం.. ఫ్యాన్స్‌లో చిన్న నిరాశ, పెళ్లికైన వస్తారా?
Common Pass | కామన్ పాస్ ధరలు తగ్గించిన ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

