రంగారెడ్డి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : జిల్లా లో మరో భూపోరాటం ప్రారంభమైంది. రీజినల్ రింగ్ రోడ్డు ((టిపులార్)ను జిల్లాలోని మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, ఫారుక్‌నగర్, కొందుర్గు తదితర మండలాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. గత బీఆర్ఎస్ హయాంలో ట్రిపులార్ కోసం గ్రామాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటుచేసి హద్దులను కూడా గుర్తించారు. అయితే, కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న ట్రిపులార్ అలైన్‌మెంట్‌ను మార్చి.. కొత్తగా రూ పొందించింది.
ఈ అలైన్మెంట్ విషయంలో ప్రభు త్వం రైతులను సంప్రదించకుండా.. వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా భూములను తీసుకుంటున్నామని, సర్వేనంబర్ల వారీగా హెచ్ఎండీ ఏ వెబ్సైట్లో పెట్టింది. దీంతో ఆయా మండలాల్లోని భూములు కోల్పోతున్న రైతులంతా భగ్గుమంటున్నా రు.
రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. పాత అలైన్‌మెంట్‌ను కొనసాగించాలని, కొత్త ట్రిపులార్ అలైన్మెంట్ వద్దే..వద్దు అంటూ మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కేశంపేట, కొందుర్గు, ఫారుక్‌నగర్ తదితర ప్రాంతాల రైతులు ఆందోళనలకు దిగారు. దీని ద్వారా అర, ఎకరం, రెండెకరాలున్న పేద, సన్న, చిన్నకారు నష్టపోతారని.. ఉన్న భూములు పోయి రోడ్డున పడతారని పేర్కొంటున్నారు. కొంతమంది నాయకులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే పాత అలైన్‌మెంట్‌ను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రజాసంఘాలు, బీఆర్ఎస్, సీపీఎం వంటి పార్టీలు రైతులకు మద్దతుగా నిలిచాయి.
భూములు పోతే ఎలా బతకాలి..
ప్రభుత్వం ట్రిపులార్ కోసం కొత్తగా రూపొందించిన అలైన్మెంట్తో సన్న, చిన్నకారు, దళితులు, అసైన్డ్‌మెంట్ రైతుల భూములే పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర, ఎకరం, రెండెకరాలు ఉన్నా తమ భూములు పోతే తాము ఎలా బతకాలని.. భూ ములను నమ్ముకునే జీవిస్తున్నామని పలువురు అన్నదాతలు గొల్లుమంటున్నారు. ప్రభుత్వం స్పందించి పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపులార్‌ను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ట్రిపులార్ బాధితుల నిరసన
కడ్తాల్ : ట్రిపులార్ అలైన్‌మెంట్‌ను మార్చడంపై బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని డిమాండ్ చేస్తు న్నారు. బుధవారం తలకొండపల్లి మండల కేంద్రం లో ప్రజా సంఘం నాయకుడు కురమయ్య అధ్యక్షతన నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, బాధిత రైతులు పాల్గొన్నారు. వెంకట్రావ్పేట, గర్విపల్లి, జంగారెడ్డిపల్లి, ఖానాపూర్, చంద్రధన గ్రామాలకు చెందిన బాధిత రైతులు మండల కేంద్రానికి చేరుకు ని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రజా సంఘల నాయకులతో కలిసి నిరసన తెలిపారు.
అనంతరం వారు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదు ట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులు, బాధిత రైతులు మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్డుతో చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బడా నాయకులు, భూస్వాముల భూముల ను కాపాడేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చిందని మండిప డ్డారు. పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపులార్‌ను నిర్మించాల ని..లేనిచో భూనిర్వాసితులతో కలిసి రైతు సంఘం ఆధ్వర్యం లో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
అనంతరం పా త అలైన్మెంట్ ప్రకారమే ట్రిపులార్‌ను చేపట్టాలని తహసీల్దార్ రమేశ్‌కు బాధిత రైతులు వినతిపత్రం అందజేశారు. నిరసన లో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటయ్య, ప్రజాసం ఘాల నాయకులు శివశంకర్, కురుమయ్య, జంగారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ వెంకటస్వామి, చెన్నంపల్లి మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ శ్రీను, రైతులు పరమేశ్, నర్సింహారెడ్డి, యాదయ్య, రమేశ్, వెంకటేశ్, స్వామి, ధర్మారెడ్డి, రాములు, తిరుపతయ్య, శ్రీశై లం, రాజ్‌కుమార్‌గౌడ్, కృష్ణ, జంగయ్య, సత్తయ్య, చందు, నారయ్య, జంగయ్య, రమేశ్‌బాబు, రామచంద్రయ్య, అంజయ్య, రామచంద్రయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొందుర్గు మండలంలోని తంగెళ్లపల్లి రైతులు ట్రిపు లార్ పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని డిప్యూ టీ తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు.
ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకుల ప్రయోజనాల కోసమే..!
ట్రిపులార్ ఏర్పాటు కోసం కొత్తగా రూపొందించిన అలైన్మెంట్తో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి బంధువులకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. పాత అలైన్మెంట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన రియల్ఎస్టేట్ వెంచర్ నుంచి వెళ్లేది. అలాగే, మరో ఎమ్మెల్యే స్వగ్రామమైన తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామంలోని భూములు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బంధువుల భూములు కూడా ఆ అలైన్మెంట్ పరిధిలోనే ఉన్నాయి.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన అలైన్‌మెంట్‌ను పాత అలైన్‌మెంట్‌కు కిలోమీటర్ దూరం నుంచి చేపట్టాలని నిర్ణయించారు. మాడ్గుల మండలంలోని అప్పారెడ్డిపల్లి వద్దగల జేబీ రియల్ఎస్టేట్ సంస్థ, అలాగే, తలకొండపల్లి మున్సిపాలిటీ సమీపంలోని బట్టర్ైప్లె రియల్ఎస్టేట్ సంస్థల మధ్య నుంచి వెళ్లేలా రూపొందించారు. దీంతో ఓ ఎమ్మెల్యే భూములు, సీఎం బంధువుల భూములు, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్‌లకు చెందిన భూములు కూడా గత అలైన్మెంట్ పరిధిలో ఉన్నా.. కొత్తగా ఏర్పాటు చేసిన అలైన్మెంట్లో వారి భూములకు మినహాయింపు ఇవ్వడంపై రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త అలైన్మెంట్ ద్వారా భూములు కోల్పోనున్న మండలాలు
మండలం : గ్రామాలు
ఆమనగల్లు : ఆమనగల్లు, చెందంపల్లి, పోలెపల్లి, సింగంపల్లి
ఫారుక్‌నగర్ : బీమారం, చించోడ్,
కేశంపేట : నిర్దవల్లి, తొమ్మిదిరేకుల,
కొందుర్గు : అగీర్వాల్, చెరుకుపల్లి, కొందుర్గు తూర్పు, కొందుర్గు పడమర, తోంపల్లి, తుమ్మలపల్లి, వనపల్లి
మాడ్గుల :అన్నెబోయినపల్లి, బ్రాహ్మణపల్లి, ఇర్విన్, మాడ్గుల
తలకొండపల్లి : చంద్రదాన, గర్విపల్లి, జల్పల్లి, ఖానాపూర్, మేడికొండపల్లి, రాంపూర్, వెంకటరావుపేట