మంచిర్యాల : జిల్లాలోని క్యాతనపల్లిలో బాల్కసుమన్ ( Balka Suman ) తో పాటు బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని( Illegal Cases) మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Former Minister ) డిమాండ్ చేశారు.
శనివారం బీఆర్ఎస్, సీపీఐ ( CPI ) పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు,చందర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేని శంకర్ మాట్లాడారు.

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని అన్నారు.తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు.క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులలో బీఆర్ఎస్, సీపీఐ కూటమి 14 వార్డులు గెలుచుకోగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగవలసిని చైర్మన్ ఎన్నికను మంత్రి వివేక్, ఎంపీ వంశీ అడ్డుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ డమ్మీ కమిషన్ మారిందని,బాల్క సుమన్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై మంత్రి వివేక్ ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. క్యాతన పల్లి మున్సిపాలిటీ చేజిక్కించు కావాలన్న కుట్రలతో బీఆర్ఎస్, సీపీఐ కూటమి కౌన్సిలర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంత్రి వివేక్ ఆదేశాలతో సింగరేణి అధికారులు క్యాతన పల్లి మున్సిపాలిటీ 11 వ వార్డు కౌన్సిలర్ భీమాగౌడ్ ఇంటిపై దాడి చేసి, కుటుంబసభ్యులపై దౌర్జన్యం చేశారని తెలిపారు. భీమాగౌడ్ తో కుటుంబానికి బీఆర్ఎస్ తరపున అండగా ఉంటామని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీకి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.
మంత్రి వివేక్ రేవంత్ తో తిరిగి దొంగలా మారిండని,సింగరేణి అధికారులు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పినట్లు పనిచేస్తున్నారని విమర్శించారు. చెన్నూరు నియోజకవర్గంలో ఎమర్జేసి పాలన నడుస్తున్నదని ఆరోపించారు.టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమాగౌడ్ కుటుంబాన్ని నాయకులు పరామర్శించారు.