Aryan Khan | లండన్‌లో సీక్రెట్ డేటింగ్లో షారుఖ్ ఖాన్ కొడుకు.. వైరల్ అవుతున్న ఫోటోలు!
Aryan Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) లండన్ ట్రిప్‌కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కొత్త వార్త వైరల్ అవుతోంది.
Aryan Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) లండన్ ట్రిప్ హాట్ టాపిక్‌గా మారింది. ఆర్యన్ ఖాన్ లండన్‌లో ఒక రహస్య యువతితో కలిసి కనిపించడంతో, వీరిద్దరి డేటింగ్ రూమర్స్ ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. లండన్‌లోని ఒక క్యాసినో నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆర్యన్ ఖాన్, ఆ యువతి మీడియా కంటపడ్డారు. అయితే వీరిద్దరూ బ్లాక్ కలర్ ట్రెండీ అవుట్ఫిట్లలో కనిపిస్తున్న ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఆ మిస్టరీ గర్ల్ ఎవరు అనేది ప్రారంభంలో ఎవరికీ తెలియకపోయినా, సోషల్ మీడియా యూజర్లు మాత్రం వెంటనే ఆరా తీసి ఆమెను ప్రముఖ సింగర్ విన్నీ తకైర్ (Vinnie Takair)గా గుర్తించారు. ఈ ఫొటోలు వైరల్ అయిన తర్వాత, విన్నీ తకైర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లండన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు. దీంతో ఈ ట్రిప్‌కు, ఆర్యన్ ఖాన్ కనిపించడానికి ముడిపెట్టి నెటిజన్లు రకరకాల చర్చలు ప్రారంభించారు. ఆర్యన్ ఖాన్, విన్నీ తకైర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరస్పరం ఫాలో అవుతుండటం, వారికి కామన్ ఫ్రెండ్స్ కూడా ఉండటంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అయితే ఈ రూమర్స్‌పై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
మరోవైపు విన్నీ తకైర్ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె ఒక సింగర్-సాంగ్‌రైటర్. ‘షైనింగ్ లైట్స్’ (Shining Lights), ‘మేబీ ఐ లవ్ యూ’ (Maybe I Love You), ‘ట్రో మిగ్’ (Tro Mig) వంటి పలు ఒరిజినల్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. స్పాటిఫై (Spotify) వంటి మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈమె పాటలు అందుబాటులో ఉన్నాయి.

Aryan Khan
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

