Rahul gandhi | పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట.. బెయిల్ ఇచ్చిన భివాండీ కోర్టు
Rahul gandhi | పరువునష్టం కేసులో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కి ఊరట లభించింది. మహారాష్ట్ర (Maharastra) లోని భివాండీ కోర్టు (Bhivandi court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని 2014లో రాహుల్‌గాంధీ ఆరోపించారు.
Rahul gandhi : పరువునష్టం కేసులో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కి ఊరట లభించింది. మహారాష్ట్ర (Maharastra) లోని భివాండీ కోర్టు (Bhivandi court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని 2014లో రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆరెస్సెస్ కేసు వేసింది.
మహారాష్ట్రలోని భివాండీ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఇవాళ జరిగిన విచారణకు రాహుల్‌గాంధీ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలోని సోనాలే గ్రామంలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. ఆరెస్సెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
మహాత్మాగాంధీ హత్య వెనుక సంఘ్ హస్తం ఉందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. దాంతో రాహుల్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ.. అప్పట్లో సంఘ్ కార్యకర్త రాజేష్ కుంటే మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదుచేశారు. ఆ కేసు విచారణలో ఇప్పుడు రాహుల్‌గాంధీకి బెయిల్ మంజూరయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

