గౌహతి: రోడ్డుపై చెత్త వేస్తున్న షాపు యజమానికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. బుల్డోజర్తో చెత్త తెచ్చి ఆ షాపు ముందు పడేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Shopkeeper Dumps Garbage On Road) అస్సాంలోని టిన్సుకియాలో ఈ సంఘటన జరిగింది. డైలీ బజార్ ప్రాంతంలోని ఒక షాపు యజమాని ప్రతి రోజూ రోడ్డుపై చెత్త పడేస్తున్నాడు. రాత్రివేళ షాపు మూసే సమయంలో ఇలా చేస్తున్నాడు.
కాగా, సోమవారం రాత్రి 9:30 గంటలకు కిరాణా, గిఫ్ట్ వస్తువుల షాపునకు చెందిన ఉద్యోగి అక్కడి రోడ్డుపై చెత్త పడేశాడు. రాత్రివేళ విధుల్లో ఉన్న టిన్సుకియా మున్సిపల్ బోర్డు సిబ్బంది ఇది చూశారు. రోడ్డుపై చెత్త వేస్తున్న ఆ ఉద్యోగిని ప్రశ్నించారు. ఏ షాపులోని చెత్తను అతడు పడేస్తున్నాడో అన్నది తెలుసుకున్నారు. అయితే ఎలాంటి జరిమానా విధించలేదు.
మరోవైపు మరునాడు ఉదయం మున్సిపల్ సిబ్బంది ఆ షాపు వద్దకు చేరుకున్నారు. బుల్డోజర్లో తెచ్చిన చెత్తను ఆ షాపు ముందు పడేశారు. పారతో చక్కగా ఆ షాపు ముందు చెత్తను పరిచారు. రోడ్డుపై చెత్త పడేస్తున్న ఆ షాపు యజమానికి ఇలా బుద్ధిచెప్పారు.
కాగా, ఆ షాపు యజమాని పదే పదే ఈ తప్పు చేస్తున్నాడని, అందుకే ఇలా గుణపాఠం చెప్పినట్లు మున్సిపల్ అధికారి తెలిపారు. ‘పట్టణం పరిశుభ్రత కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని టిన్సుకియా మున్సిపల్ బోర్డు చైర్మన్ పులక్ చెటై మీడియాతో అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
All shopkeepers in Tinsukia, Assam were asked to not throw garbage on the road.
But one guy didn’t listen and dumped garbage on the road.
And next day, garbage was dumped in front of his shop by municipal board 😂
Maybe this is the only solution to keep streets clean. pic.twitter.com/BZr6lw8g3R
— Incognito (@Incognito_qfs) September 8, 2025
Also Read:
Watch: కదులుతున్న లారీపై చోరీ.. వీడియో వైరల్, ఆరుగురు అరెస్ట్
man kills two women | ఇద్దరు మహిళలను హత్య చేసిన వ్యక్తి.. పోలీస్ కస్టడీలో ఆత్మహత్య
JK AAP MLA Arrest | ఎమ్మెల్యే అరెస్ట్‌పై నిరసనలు.. ఇంటర్నెట్ నిలిపివేత, పరీక్షలు రద్దు