భువనేశ్వర్: ఇంట్లో నిద్రించిన పసి బాబు అతడి అక్కను పాము కాటేసింది. అయితే తల్లిదండ్రులు వారిని హాస్పిటల్‌కు బదులు మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు. విషం విరుగుడుకు అతడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. (Infant, Sister Die Of Snakebite) ఈ నేపథ్యంలో చిన్నారులైన అక్కాతమ్ముడు మరణించారు. ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజ్పూర్ గ్రామంలోని ఇంట్లో 9 నెలల రితురాజ్ హరిజన్, సోదరి అయిన 11 ఏళ్ల అమిత నిద్రించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆ ఇంట్లోకి దూరిన విషపూరిత పాము ఆ చిన్నారులను కాటేసింది.
కాగా, గమనించిన తల్లిదండ్రులు పాము కాటేసిన తమ పిల్లలను హాస్పిటల్‌కు బదులు స్థానిక మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు. అయితే విషం విరుగుడు కోసం మూడు గంటలకుపైగా అతడు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించింది. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు పాము కాటేసిన వెంటనే ఆ పిల్లలను హాస్పిటల్‌కు తీసుకువచ్చి ఉంటే విష నిరోధక ఇంజెక్షన్ ద్వారా కాపాడవచ్చని జిల్లా చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ సంతోష్ కుమార్ పాండా తెలిపారు. మంత్రగాళ్ల వద్దకు కాకుండా పాము కాటు రోగులును వెంటనే ఆసుపత్రికి తీసుకురాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పాము కాటుకు సత్వర చికిత్స గురించి గ్రామస్తులకు అవగాహన కల్పిచేందుకు ప్రచారం చేపడతామని అన్నారు.
Also Read:
Boy Accidentally Shoots Himself | పిస్టల్‌తో ఆడిన బాలుడు.. ప్రమాదవశాత్తు కాల్చుకుని మృతి
Watch: పోలీసులను తోసి పారిపోయిన అత్యాచార నిందితుడు.. వీడియో వైరల్
Watch: కారు సన్‌రూఫ్ వద్ద నిల్చొన్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?