జైపూర్: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు తండ్రికి చెందిన పిస్టల్‌తో ఆడాడు. ప్రమాదవశాత్తు తనను తాను కాల్చుకున్న ఆ చిన్నారి మరణించాడు. (Boy Accidentally Shoots Himself) ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. రాజస్థాన్‌లోని కోట్‌పుట్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విరాట్‌నగర్ ప్రాంతంలోని చిటౌలి కా బర్దా గ్రామానికి చెందిన ముఖేష్ ఆదివారం తన భార్యతో కలిసి బయటకు వెళ్లాడు. వారి ఐదేళ్ల కుమారుడు దేవాన్షు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు.
కాగా, ఇంట్లో ఆడుకుంటున్న ఆ బాలుడు ఒక బాక్స్‌లో ఉన్న తండ్రికి చెందిన పిస్టల్‌ను బయటకు తీశాడు. దానితో ఆడిన అతడు ప్రమాదవశాత్తు ట్రిగర్ నొక్కి తనను తాను కాల్చుకున్నాడు. గన్ పేలుడు శబ్దం విన్న పొరుగువారు ఆ ఇంటికి చేరుకున్నారు. దేవాన్షు రక్తం మడుగుల్లో ఉండటం చూసి షాకయ్యారు. ఆసుపత్రికి తరలించగా ఆ బాలుడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో దేవాన్షు తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవాన్షు తండ్రి ముఖేష్ గతంలో డిఫెన్స్ అకాడమీ నడిపినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఏడాది కిందట దానిని మూసివేశాడని చెప్పారు. జానపద గాయకురాలైన తన భార్యతో కలిసి పాటలు పాడుతున్నాడని వెల్లడించారు. దేవాన్షు వారి ఏకైక సంతానమని వివరించారు.
Also Read:
Unmarked Graves | ఉత్తర కశ్మీర్లో భారీగా గుర్తు తెలియని సమాధులు.. 90 శాతం ఉగ్రవాదులవే
Newly wed Woman Ends Life | ప్రేమించిన వ్యక్తితో వివాహం.. పెళ్లైన నాలుగు నెలలకే నవవధువు ఆత్మహత్య
Watch: కారు సన్‌రూఫ్ వద్ద నిల్చొన్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?