జెరుసలాం: ఇరాన్‌పై మరింత భీకరంగా దాడి చేసేందుకు అమెరికా సన్నద్దమువుతోంది. హోర్ముజ్ జలసంధిని అగ్నిగుండంగా మార్చిన ఇరాన్‌పై మరింత విస్తృత స్థాయిలో విరుచుకుపడేందుకు అమెరికా తన ఆయుధాలను సిద్ధం చేస్తున్నది. దీనిలో భాగంగానే బీ-1 బాంబర్ విమానాలకు ఆయుధాలను లోడింగ్ చేస్తున్నది. భూగర్భంలో ఉన్న బంకర్లను పేల్చే బంకర్ బస్టర్ బాంబులను అమెరికా తన బీ-1 విమానాలకు లోడింగ్ చేసింది. బ్రిటన్‌లోని ఆర్ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా బీ-1 బాంబర్ విమానాల్లో ఆ లోడింగ్ జరిగింది. ఏ క్షణమైనా మళ్లీ బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. అమెరికా వైమానిక దళం బీ-1 బాంబర్లను సిద్ధం చేస్తున్న వీడియోలు బుధవారం రిలీజయ్యాయి. ఇరాన్లో ఉన్న క్షిపణి, డ్రోన్ స్టోరేజ్ కేంద్రాలను బీ-1 బాంబర్ల ద్వారా టార్గెట్ చేయాలని పెంటగాన్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
గగనతలం నుంచి వదిలే క్రూయిజ్ క్షిపణులను బీ-1 బాంబర్ మోసుకెళ్లగలదు. కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను పేల్చేందుకు బీ-1 బాంబర్ విమానం ఆ క్షిపణిని రిలీజ్ చేస్తుంది. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ రేంజ్ నుంచి కూడా బీ-1 బాంబర్ విమానం క్షిపణిని రిలీజ్ చేయగలదు. అయితే కొన్ని రోజుల నుంచి జరుగుతున్న యుద్ధంలో.. ఇరాన్‌కు చెందిన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాలను పేల్చివేయడం వల్ల .. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను స్టోర్ చేసిన ప్రాంతాలను అతిసమీపం నుంచి బీ1 బాంబర్లతో టార్గెట్ చేయాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అమెరికా దళంలో మొత్తం 40 బీ-1ఎస్ బాంబర్ విమానాలు ఉన్నాయి. అయితే ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఒకవేళ అమెరికా ఒక్క బాంబర్ విమానాన్ని కోల్పోయినా.. అప్పుడు అగ్రరాజ్యానికి అది పెను నష్టాన్ని మిగిలిస్తుందని నిపుణులు అంటున్నారు. బీ-1 బాంబర్ విమానాల్లోకి ఆయుధాలను లోడింగ్ చేస్తున్న వీడియోలను రిలీజ్ చేసి ఒక రకంగా ఇరాన్‌కు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.
Bunker-busting bombs are reportedly being loaded onto U.S. B-1 strategic bombers at RAF Fairford in the United Kingdom, signaling possible preparations for strikes on hardened underground targets. #WashingtonEye pic.twitter.com/FJAM7mX4WI
— Washington Eye (@washington_EY) March 12, 2026