తిరువనంతపురం: చాలా కాలంగా ప్రేమించుకున్న జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లైన నాలుగు నెలలకే నవవధువు ఆత్మహత్య చేసుకున్నది. దీంతో రెండు కుటుంబాలు షాక్ అయ్యాయి. (Newly wed Woman Ends Life) కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పెరియ అయంపరకు చెందిన 21 ఏళ్ల నందన, అరమంగనం ప్రాంతానికి చెందిన రంజేష్ చాలా కాలంగా రిలేషన్లో ఉన్నారు. చివరకు వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 26న బంధువులు, స్నేహితుల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిగింది.
కాగా, పెళ్లైన నాలుగు నెలలకే నందన అనూహ్య నిర్ణయం తీసుకున్నది. ఆదివారం మధ్యాహ్నం తన జీవితాన్ని ముగిస్తున్నట్లు తల్లికి మెసేజ్‌తో పాటు ఉరి ఏర్పాటు ఫొటో పంపింది. భర్త ఇంట్లోని బెడ్ రూమ్‌లో సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మరోవైపు మెసేజ్, ఫొటో చూసిన నందన తల్లి వెంటనే ఆమె అత్తింటి వారిని అప్రమత్తం చేసింది. డోర్ లాక్ చేసిన బెడ్రూమ్ తలుపులు బద్ధలుకొట్టి వారు లోనికి వెళ్లారు. నందన మృతదేహం సీలింగ్‌కు వేలాడటాన్ని చూసి షాకయ్యారు. ఆమె ఎందుకు సూసైడ్ చేసుకున్నదో అన్నది ఎవరికీ అర్థం కాలేదు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. నందన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Fake Babas Arrested | బంగ్లాదేశ్ జాతీయులతో సహా.. 14 మంది నకిలీ బాబాలు అరెస్ట్
Lalu Prasad Yadav | లాలూను కలిసిన ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. బీజేపీ విమర్శ