అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లా ( Nellore District ) లో దారుణం జరిగింది. రాపూరు ఘాట్‌రోడ్డు వద్ద అడవిలో వివాహిత, యువకుడు పురుగుల మందు తాగి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య ( Suicide ) చేసుకున్నారు. ప్రసన్నకుమార్(25), వివాహిత(24) గా గుర్తించారు.
స్థానికుల సమాచారం మేరకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఇద్దరు ప్రేమించు కున్నారని, కలిసి జీవించే అవకాశం లేదని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.