Dasoju Shravan kumar | ప్రశ్నాపత్రం సరిగ్గా రెడీ చేయలేని ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తుందో..? : ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్‌కుమార్
Dasoju Shravan kumar | ఒకే పేపర్‌తో రెండు పరీక్షలా..? అంటూ రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన లా కోర్సుల పరీక్షల విషయంలో జరిగిన గందరగోళాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Dasoju Shravan kumar | రాష్ట్రంలో విద్యావ్యవస్థలో నెలకొన్నఅవ్యవస్థ, పరిపాలనలో చోటుచేసుకుంటున్న వైఫల్యాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్‌కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా ‘లా’ పరీక్షల నిర్వహణలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని.. ఒకే పేపర్‌తో రెండు పరీక్షలా..? అంటూ రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన లా కోర్సుల పరీక్షల విషయంలో జరిగిన గందరగోళాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉస్మానియాలో ఐదేళ్ల లా కోర్సు (ఫిబ్రవరి 25), మూడేళ్ల హానర్స్ లా కోర్సు (ఫిబ్రవరి 27) పరీక్షలకు ఒకే ప్రశ్నాపత్రం ఇవ్వడం విద్యా శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
‘హిస్టరీ ఆఫ్ కోర్ట్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్స్ ఇన్ ఇండియా’ (5 Years), ‘లీగల్ అండ్ కాన్స్టిట్యూషన్ హిస్టరీ ఆఫ్ ఇండియా’ (3 Years) పేపర్లు ఒకేలా రావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 25న జరిగిన పరీక్ష అనంతరం, ఫిబ్రవరి 27న జరిగిన పరీక్షకు అదే ప్రశ్నాపత్రం ఎలా వచ్చిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
ప్రశ్నాపత్రం సైతం సక్రమంగా సిద్ధం చేయలేని ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా సమర్థంగా నడిపిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని దాసోజ్ శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు.
ఉస్మానియా ‘లా’ పరీక్షల్లో ఘోర వైఫల్యం: ఒకే పేపర్‌తో రెండు పరీక్షలా? రేవంత్ సర్కార్‌పై తీవ్ర ధ్వజం!@revanth_anumula
ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన లా కోర్సుల పరీక్షల గందరగోళంపై విమర్శల జడి వస్తోంది. విద్యాశాఖ మరియు యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని,… pic.twitter.com/zuZQPiPuIu— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) March 3, 2026
Read Also :
Sanju Samson | అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో .. సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
Asif Zardari | మరో యుద్ధానికి భారత్ సన్నాహాలు.. పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ ఆరోపణలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breakfast | ఉదయం అల్పాహారంలో ఇవి తింటున్నారా? రోజంతా నీరసం వస్తుంది..!
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలతో ఇంటి పనులు చేయిస్తున్న జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

