హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల బీఈడీ కోర్సులో సీట్ల భర్తీకి నిర్వహించే ఎడ్‌సెట్ మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్‌ను పొడిగించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆగస్టు 3 వరకు అవకాశం కల్పించారు.
ఆగస్టు 7 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని, 11న వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, ఆగస్టు 16న సీట్ల కేటాయిస్తామని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. సీట్లు పొందిన వారు ఆగస్టు 17 నుంచి 20 లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలన్నారు.