హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : ఎంసీఆర్‌హెచ్చార్డీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా వారం రోజుల పాటు ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సివిల్ సర్వీస్, గ్రూప్ -1 విజేతలతో ఆగస్టు 3న ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని సంస్థ ఫ్యాకల్టీ శ్రీనివాస్ చెప్పారు. ఆసక్తి గల వారు ఆగస్టు 1లోగా బయోడేటాను ctsmcrhrdit24@gmail.comకు పంపించాలని సూచించారు. పూర్తి వివరాలకు, 91212 18354 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.