భోపాల్: ఒక వ్యక్తిని అతడి మూడో భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. (Man Killed By Third Wife) దుప్పట్లలో చుట్టి సంచిలో కుక్కి మృతదేహాన్ని బావిలో పడేశారు. అయితే రెండో భార్య అయిన మూడో భార్య సోదరి బావిలో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సకారియా గ్రామానికి చెందిన 60 ఏళ్ల భయ్యాలాల్ రాజక్‌కు మూడు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య అతడ్ని విడిచి వెళ్లిపోయింది. దీంతో గుడ్డి బాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టకపోవడంతో గుడ్డి చెల్లెలైన మున్నీని మూడో వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా ఇద్దరు పిల్లలు పుట్టారు.
కాగా, మూడో భార్య మున్నీ అలియాస్ విమలకు స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణ్ దాస్ కుష్వాహా అలియాస్ లల్లూతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భయ్యాలాల్ అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ వేశారు. కూలీ పని చేసే 25 ఏళ్ల ధీరజ్ సహకారం తీసుకున్నారు. ఆగస్ట్ 30న అర్ధరాత్రి వేళ నారాయణ్ దాస్, ధీరజ్ ఆ ఇంటికి చేరుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఇంట్లోని మంచంపై నిద్రిస్తున్న భయ్యాలాల్ తలపై సుత్తితో కొట్టి హత్య చేశారు. దుపట్లలో మృతదేహాన్ని చుట్టి సంచిలో కుక్కి గ్రామంలోని బావిలో పడేశారు.
మరునాడు రెండో భార్య గుడ్డి బాయి ఆ బావి వద్దకు వెళ్లింది. అందులో ఏదో మూట తేలుతున్నట్లు గమనించి గ్రామస్తులకు చెప్పింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమక్షంలో బావిలోని నీటిని తోడి ఆ మూటను బయటకు తీశారు. దానిని విప్పి చూడగా భయ్యాలాల్ మృతదేహం బయటపడింది. అతడి మొబైల్ ఫోన్ కూడా ఆ బావిలో దొరికింది.
మరోవైపు ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణ్ దాస్‌తో వివాహేతర సంబంధం నేపథ్యంలో మూడో భార్య మున్నీ తన భర్తను హత్యచేసిందని దర్యాప్తులో తెలుసుకున్నారు. హత్యకు సహకరించిన ధీరజ్‌తో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Woman Gang-Raped By 2 Men | పుట్టిన రోజు పార్టీ తర్వాత.. యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం
Girl Gives Birth, Infant Dies | బాలికపై వ్యక్తి అత్యాచారం.. ఆమె ప్రసవించిన శిశువు మృతి