Nani | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో టైర్-1 హీరోగా నిలబడాలనే లక్ష్యంతో వరుసగా మాస్ సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. క్లాస్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాని, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే మాస్ మసాలా కథలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది.ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన కథను నాని తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలు సున్నితమైన భావోద్వేగాలతో కూడిన క్లాస్ కథలుగా ఉంటాయి. నానిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక మంచి కథ సిద్ధం చేసినప్పటికీ, ప్రస్తుతం తాను మాస్ ఇమేజ్ను పెంచుకునే దిశగా ముందుకు సాగుతున్నానని నాని చెప్పినట్లు సమాచారం.
ప్రస్తుతం నేను మాస్ సినిమాలపై దృష్టి పెట్టాను. ఈ సమయంలో మళ్లీ క్లాస్ సినిమాల వైపు వెళ్లడం కష్టం సర్ అంటూ నాని సున్నితంగా ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించాడని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో శేఖర్ కమ్ముల కొంత నిరాశకు గురైనట్లు కూడా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా, గతంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ సినిమాకు కూడా మొదట నానినే అనుకున్నారట శేఖర్ కమ్ముల. అయితే అప్పట్లో కూడా నాని ఆ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపకపోవడంతో ఆ అవకాశం నాగచైతన్యకు వెళ్లింది. ఇలా వరుసగా తన ప్రాజెక్టులు నాని వద్ద నుంచి తిరస్కరణకు గురవడంతో శేఖర్ కమ్ముల కొంత అసంతృప్తిగా ఉన్నారని ఫిలిం నగర్ టాక్.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన తదుపరి ప్రాజెక్ట్ ‘హ్యాపీడేస్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నాని కూడా తన కెరీర్‌ను మరింత విస్తరించే దిశగా భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. మాస్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. మరి భవిష్యత్తులో అయినా నాని – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సినీ అభిమానులు మాత్రం ఈ క్రేజీ కాంబో ఎప్పుడో ఒకప్పుడు సాకారం కావాలని ఆశిస్తున్నారు.