బాగ్దాద్: ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ డ్రగ్స్ చికిత్సాలయంపై సోమవారం రాత్రి పాకిస్థాన్ ఆకస్మిక దాడి చేసింది. ఆ దాడి వల్ల కాబూల్‌లోని ఆస్పత్రిలో 400 మంది మృతిచెందగా, మరో 250 మంది గాయపడ్డారు. డ్రగ్ రిహాబిలిటేషన్ ఆస్పత్రిపై రాత్రి 9 గంటలకు దాడి జరిగినట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ తెలిపారు. అయితే ఈ ఘటన పట్ల ఆఫ్ఘన్ క్రికెటర్ రహీద్ ఖాన్(Rashid Khan ) స్పందించారు. పాక్ మిలిటరీ చర్యను ఆయన ఖండించారు. పాకిస్థాన్ వైమానిక దాడుల వల్లే ప్రాణనష్టం జరిగినట్లు ఆ క్రికెటర్ చెప్పారు. పవిత్రమైన రంజాన్ మాసం సమయంలో ఈ దాడి జరగడం దారుణమన్నారు. తన ఎక్స్ అకౌంట్లో రషీద్ ఖాన్ రియాక్ట్ అయ్యారు.
సాధారణ పౌరులు చనిపోవడం బాధగా ఉన్నట్లు చెప్పారు. ఇండ్లను, విద్యా సంస్థలను, వైద్య కేంద్రాలను కావాలని లేదా అనుకోకుండా అటాక్ చేసినా అది యుద్ధ నేరమే అవుతుందని రషీద్ పేర్కొన్నారు. రంజాన్ పవిత్ర మాసం వేళ మనుషుల ప్రాణాలు విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరు తీవ్రంగా కలచివేస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల వైరం, ద్వేషం పెరుగుతుందన్నారు. ఐక్యరాజ్యసమితి, ఇతర మానవ హక్కుల సంఘాలు ఈ ఘటన పట్ల దర్యాప్తు చేపట్టాలని కోరారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కష్ట సమయంలో ఆప్ఘన్ ప్రజలకు అండగా ఉండనున్నట్లు చెప్పారు.
I am deeply saddened by the latest reports of civilian casualties as a result of Pakistani airstrikes in Kabul. Targeting civilian homes, educational facilities or medical infrastructure, either intentional or by mistake, is a war crime. The sheer disregard for human lives,… pic.twitter.com/DbFRRh2qAJ
— Rashid Khan (@rashidkhan_19) March 16, 2026