లక్నో: వివాహితుడైన వ్యక్తి ఒక బాలికను లోబర్చుకున్నాడు. ఆమెను బ్లాక్మెయిల్ చేసి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన ఆ బాలిక నెలలు నిండని శిశువును ప్రవించింది. అయితే పుట్టిన కొన్ని నిమిషాలకే ఆ బిడ్డ మరణించింది. (Girl Gives Birth, Infant Dies) ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల రషీద్ వివాహితుడు. అతడికి ఇద్దరు పిల్లలున్నారు.
కాగా, ఏడు నెలల కిందట పొరుగున నివసించే 11 ఏళ్ల బాలికకు పండు ఇస్తానని చెప్పి తన ఇంటికి రషీద్ రప్పించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడు. తనతో లైంగిక సంబంధం కొనసాగించాలని బలవంతం చేశాడు. వీడియో రికార్డ్ చేసి ఆ బాలికను బ్లాక్మెయిల్ చేశాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరోవైపు సెప్టెంబర్ 4న ఆ బాలిక కడుపు నొప్పితో బాధపడింది. దీంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అల్ట్రాసౌండ్ పరీక్ష చేసిన డాక్టర్లు ఆ బాలిక ఏడు నెలల గర్భిణి అని నిర్ధారించారు. దీంతో ఆమెను మహిళా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అదే రోజున నెలలు నిండని బిడ్డను ప్రసవించింది. అయితే కొద్దిసేపటికే ఆ శిశువు మరణించించింది. అధిక రక్త స్రావం, చిన్న వయస్సులో కాన్పు వల్ల ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. అయితే ఆమె కోలుకుంటున్నది వెల్లడించారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. బాలిక సోదరుడి ఫిర్యాదుతో నిందితుడైన రషీద్‌ను అరెస్ట్ చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన నిందితుడి డీఎన్ఏతో సరిపోల్చడానికి మరణించిన శిశువు డీఎన్ఏ నమూనా సేకరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. రషీద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో లైబ్రరీ క్లర్క్‌గా పని.. రోజుకు రూ.522 జీతం