బాసెల్: భారీ అంచనాలతో స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ ఆడేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన భారత యువ షట్లర్లకు తొలిరోజు నిరాశజనక ఫలితాలు ఎదురయ్యాయి. మెన్స్ సింగిల్స్‌లో కిరణ్ జార్జి ఒక్కడే.. 23-21, 21-19తో ప్రపంచ మాజీ చాంపియన్, 11వ ర్యాంకర్ లో కీన్ యి (సింగపూర్)కు షాకిచ్చి రెండో రౌండ్‌కు ముందంజ వేశాడు.
అయూశ్ శెట్టి, తన్వి శర్మ, ఉన్నతి హుడాతో పాటు సీనియర్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ ఫస్ట్రౌండ్కే ఇంటిబాట పట్టారు. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-రుత్విక శివాని ద్వయం కూడా ఓటమిపాలైంది.