పనాజీ: పార్కింగ్ విషయంపై రెస్టారెంట్ సిబ్బంది, మహిళా జడ్జి మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ జడ్జి, రెస్టారెంట్ యజమాని ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. (Judge, Restaurateur File Complaints) దీంతో ఇరువురి ఫిర్యాదులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సివిల్ జడ్జి దీపాంషి చౌదరి, తన భర్త నితిన్ లాల్‌తో కలిసి గోవా వెళ్లారు. శుక్రవారం రాత్రి అంజునా బీచ్‌లోని ఒక రెస్టారెంట్ వద్ద పార్కింగ్ వివాదంపై సిబ్బంది, వారి మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో జడ్జి దీపాంషి చౌదరి ఆ రెస్టారెంట్ సిబ్బందిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను, తన భర్తను సిబ్బంది దుర్భాషలాడారని, నెట్టారని, బెదిరించారని, తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించారు. దీంతో రెస్టారెంట్ సిబ్బందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు రెస్టారెంట్ యజమాని సమర్థ్ సింఘాల్ కూడా జడ్జి దీపాంషి చౌదరి, ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బందిని వారు తిట్టారని, నిర్బంధించినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మహిళా న్యాయమూర్తి, ఆమె భర్తపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇరువురి ఫిర్యాదులపై నమోదైన కేసులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Wife Kills Husband | మద్యానికి బానిసైన భర్త.. చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య
Dead Man Moves In Funeral | ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటన.. అంత్యక్రియలప్పుడు కదిలిన యువకుడు