ముంబై: కాబోయే భార్యతో శృంగారానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఆమె నిరాకరించడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గొంతునొక్కి ఆ యువతిని హత్య చేశాడు. (Man Rapes and Strangles Girl) దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బిబల్ధర్ గ్రామానికి చెందిన ఒక యువకుడు బుధవారం మధ్యాహ్నం నిశ్చితార్థం జరిగిన యువతి ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులు పొలానికి వెళ్లడంతో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్నది.
కాగా, కాబోయే భార్యతో శారీరక సంబంధం కోసం ఆ వ్యక్తి ఒత్తిడి చేశాడు. శృంగారానికి ఆమె నిరాకరించడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గొంతునొక్కి ఆ యువతిని హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తె మరణించి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. మైనర్ బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, స్థానికుల సమాచారం ఆధారంగా నిందితుడ్ని నీలేష్గా పోలీసులు గుర్తించారు. అటవీ ప్రాంతానికి పారిపోయిన అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Wife Kills Husband | మద్యానికి బానిసైన భర్త.. చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య
cargo ropeway snaps | కొండపై ఉన్న ఆలయం వద్ద తెగిన కార్గో రోప్ వే.. ఆరుగురు మృతి
Amity student slapped | స్టూడెంట్ చెంపపై 30 సార్లు కొట్టిన విద్యార్థులు.. వీడియో వైరల్