లక్నో: కారులో ఉన్న స్టూడెంట్‌పై తోటి విద్యార్థులు దాడి చేశారు. సుమారు 30 సార్లు అతడి చెంపపై కొట్టారు. (Amity student slapped) యూనివర్సిటీ క్యాంపస్‌కు రావద్దని అతడ్ని హెచ్చరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధానిలో ఈ సంఘటన జరిగింది. లక్నోలోని అమిటీ యూనివర్సిటీకి చెందిన లా స్టూడెంట్ శిఖర్ ఆగస్టు 26న కాలేజీకి వెళ్తుండగా స్నేహితుడు కారులో ఎక్కించుకున్నాడు.
కాగా, యూనివర్సిటీలోని పార్కింగ్ ప్రాంతానికి ఆ కారు చేరుకున్నది. అయితే ఒక మహిళా స్టూడెంట్, మరో విద్యార్థి కలిసి కారులో ఉన్న శిఖర్‌పై దాడి చేశారు. సుమారు 30 సార్లు అతడి చెంపలపై కొట్టారు. చేతిని ముఖానికి అడ్డుపెట్టుకోగా తీయాలని, లేకపోతే ఇంకా ఎక్కువగా కొడతామని హెచ్చరించారు. అతడ్ని తిట్టడంతోపాటు క్యాంపస్‌కు రావద్దని బెదిరించారు. అయితే తోటి విద్యార్థులు అతడ్ని ఎందుకు కొట్టారు అన్నది తెలియలేదు.
మరోవైపు ఈ దాడిలో శిఖర్ తీవ్రంగా గాయపడినట్లు అతడి తండ్రి ఆరోపించారు. నాటి నుంచి తన కుమారుడు కాలేజీకి వెళ్లడం లేదని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఆ స్టూడెంట్‌పై దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A video of an Amity University law student in UP’s Lucknow being slapped by classmates atleast 26 times in over a minute has surfaced on social media. The trigger behind this incident is yet to be ascertained. pic.twitter.com/FssBFAvEuT
— Piyush Rai (@Benarasiyaa) September 5, 2025
Also Read:
Dead Man Moves In Funeral | ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటన.. అంత్యక్రియలప్పుడు కదిలిన యువకుడు
Nude Gang | మహిళలను బెంబేలెత్తిస్తున్న ‘న్యూడ్ గ్యాంగ్’.. డ్రోన్లతో పోలీసుల నిఘా
Watch: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై దాడికి యత్నం.. ఎందుకంటే?