Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహా రెడ్డి దంపతులు రీసెంట్గా తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఆనందంగా, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. మార్చి 6న జరిగిన ఈ ప్రత్యేక సందర్భంగా బన్నీ తన భార్యకు ఖరీదైన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తమ ప్రేమకు గుర్తుగా స్నేహారెడ్డికి లగ్జరీ కారును కానుకగా ఇచ్చి మరోసారి తన ప్రేమను వ్యక్తం చేశారు.ఈ ప్రత్యేక రోజున అల్లు అర్జున్ తన భార్యకు సుమారు రూ.1.5 కోట్ల విలువైన Mercedes‑Benz AMG CLE 53 కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన చిన్న కార్యక్రమంలో బన్నీ తన తండ్రి అల్లు అరవింద్ కుమారుడు అల్లు అయాన్ సమక్షంలో కారు తాళాలను స్నేహారెడ్డికి అందజేశారు.
ఈ క్షణం ఎంతో భావోద్వేగంగా మారింది. భర్త ఇచ్చిన ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి స్నేహారెడ్డి ఆనందంతో బన్నీని హగ్ చేసుకొని ప్రేమగా బుగ్గపై ముద్దుపెట్టుకున్నారు. ఈ మధుర క్షణాలను బన్నీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో అభిమానుల్లో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మెర్సిడెస్ బెంజ్ AMG CLE 53 కారుకు షోరూమ్ ధర సుమారు రూ.1.28 కోట్ల నుంచి రూ.1.35 కోట్ల మధ్య ఉంటుంది. అయితే ఆన్-రోడ్ ధర దాదాపు రూ.1.5 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజిన్ మరియు లగ్జరీ ఫీచర్లతో ఈ కారు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించింది.
అల్లు అర్జున్ – స్నేహారెడ్డి జంట టాలీవుడ్లో అత్యంత క్యూట్ ,ఆదర్శ దంపతులుగా పేరుగాంచారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011 మార్చి 6న జరిగిన వీరి వివాహం అప్పట్లో టాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వారి అన్యోన్యమైన దాంపత్యానికి గుర్తుగా అబ్బాయి అయాన్, అమ్మాయి అర్హా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంతో కలిసి తరచూ హాలిడేలకు వెళ్లడం, ప్రత్యేక రోజులను సెలబ్రేట్ చేయడం వీరి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది తమ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా విదేశీ టూర్‌కు వెళ్లే ఈ జంట, ఈసారి మాత్రం కుటుంబ వేడుకల మధ్య ఈ ప్రత్యేక రోజును జరుపుకుంది. కారణం ఏమిటంటే అదే రోజు బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ తన ప్రేయసి నయనిక రెడ్డిను వివాహం చేసుకోవడం. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో బన్నీ దంపతులు కూడా తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
Celebrating 15 years of love and togetherness. 🖤
A special anniversary surprise from Icon star @alluarjun for #AlluSnehaReddy garu 🤩
A wholesome moment. ✨ pic.twitter.com/nNxU7QefDd
— Team Allu Arjun (@TeamAAOfficial) March 7, 2026