జైపూర్: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ (Bikaner Ki Sherni) ప్రయాణించిన వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఘర్షణ జరుగడంతో ఆ యువతి కర్రతో వీరంగం చేసింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఆమెను కిందకు తోసి కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన 21 ఏళ్ల మోనికా రాజ్‌పురోహిత్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ‘బికనీర్ కి షెర్ని’ పేరుతో ఆమె పాపురల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
కాగా, మోనికా తన బృందంతో కలిసి స్కార్పియోలో ప్రయాణించింది. జోధ్‌పూర్ హైవేపై మరో వాహనాన్ని ఆమె కారు ఢీకొట్టింది. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన మోనికా కర్ర చేతపట్టి దాడికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఒక వ్యక్తి ఆమెను కిందకు నెట్టి కొట్టేందుకు యత్నించాడు. కొందరు జోక్యం చేసుకుని అతడ్ని నిలువరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ‘బికనీర్ కి షెర్ని’గా పాపురల్ అయిన మోనికా రాజ్పురోహిత్పై పలు ఆరోపణలున్నాయి. గత ఏడాది ఓపియం తాగుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది వైరల్ కావడంతో ఆమె ఇంట్లో పోలీసులు సోదా చేశారు. 200 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మోనికాను కస్టడీలోకి తీసుకుని ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. అలాగే దాడి, కిడ్నాప్ యత్నం, బ్లాక్మెయిల్ వంటి ఆరోపణలపై ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మోనికా మొబైల్ ఫోన్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
जोधपुर: एक लड़की से मारपीट का वीडियो वायरल हो रहा है, लड़की को कथित तौर पर “बीकानेर की शेरनी” के नाम से संबोधित किया जा रहा है, इसमें युवक द्वारा लड़की से मारपीट करते दिख रहा है… ऐसा क्यों हो रहा है? जांच हो तो पता चले…! pic.twitter.com/Opae6caW6D
— RS KHATANA (@rskhatana72) September 5, 2025
Also Read:
Man Shoots Wife Dead | ‘నా డబ్బు తినేస్తున్నది’.. భార్యను కాల్చి చంపిన భర్త