ఫిరాయింపులపై రేపు తుది విచారణ
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు సంబంధించి దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ కీలక దశకు చేరుకున్నది. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎదుట గురువారం తుది విచారణ జరుగనున్నది.
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు సంబంధించి దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ కీలక దశకు చేరుకున్నది. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎదుట గురువారం తుది విచారణ జరుగనున్నది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి తుది వాదనలు జరుగనున్నాయి.
తొలుత ఉదయం 11 గంటలకు పిటిషనర్, కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, రెస్పాండెంట్ కడియం శ్రీహరి మధ్య వాద ప్రతివాదనలు జరుగనున్నాయి. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పిటిషనర్ హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి, రెస్పాండెంట్ దానం నాగేందర్ మధ్య వాదనలు జరుగనున్నాయి. ఆ తరువాత ఒంటిగంటకు పిటిషనర్ ఆలేటి మహేశ్వర్‌రెడ్డి, రెస్పాండెంట్ దానం నాగేందర్ తుది వాదనలు ఉంటాయి.
ఈ విచారణలో భాగంగా ఉభయ పక్షాలవారు తమ తుది వాదనలను వినిపించనున్నారు. కేవలం మౌఖిక వాదనలే కాకుండా, సంక్షిప్తంగా లిఖితపూర్వక వివరణలను కూడా సమర్పించాలని స్పీకర్ కార్యాలయం స్పష్టంచేసింది. ఈ విచారణ అనంతరం స్పీకర్ తన తుది నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఇరుపక్షాల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తిచేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో గురువారంలోగా ఇరువైపులా వాదనలు ముగించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ తుది విచారణను గురువారానికి వాయిదా వేస్తూ షెడ్యూల్ జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

