అర్వపల్లి, ఆగస్టు 14 : హత్య రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని బీఆర్ఎస్ అర్వపల్లి మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్, రాష్ట్ర నాయకుడు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం తిమ్మాపురంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తిమ్మాపురంలో గురువారం నిర్వహిస్తున్న బోనాల పండుగలో భాగంగా బిఆర్ఎస్ యువజన కార్యకర్త గుణగంటి చంద్రకాంత్ గౌడ్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేయగా చంద్రకాంత్ తో పాటు మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తిమ్మాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోమారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ చంద్రకాంత్ గౌడ్ పై జరిగిన తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తుంగతుర్తి నియోజకవర్గం ఎలాంటి హత్య రాజకీయాలు లేకుండా పచ్చని పంట పొలాలతో ప్రశాంతంగా జీవించిన ప్రజలు రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ గొడవలు, హత్యలకు ప్రోత్సహిస్తుందన్నారు.
కాంగ్రెస్ పాలనలో జాజిరెడ్డిగూడెం మండలంలో కోమటిపల్లి, కాసర్లపహాడ్, తిమ్మాపురం గ్రామాలలోని బీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడులే అందుకు నిదర్శనమని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఎమ్మెల్యే కాదని నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే అని ఈ విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తిమ్మాపురంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సింగిల్ విండో ఆఫీస్ మీద దాడి చేసి సీఈఓ ను కొట్టడం, పాల సొసైటీ ఎన్నికలు పెట్టి ఎన్నికల అధికారిని కొట్టి బ్యాలెట్ బాక్స్ లను ఎత్తుకెళ్లడం వారి హత్య రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు.
ఒకప్పుడు ఊళ్ళల్లోకి వస్తే సమాధులు గోరీలే దర్శనమిచ్చాయని. అలాంటి రాజకీయాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా చెక్ పెడితే. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ దాన్ని పునరావృతం చేస్తుందని విచారణ వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే,మంత్రులు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని. ఇలానే చేస్తే మాకు కార్యకర్తలు ఉన్నారని హెచ్చరించారు. పోలీస్ శాఖ ఎలాంటి ప్రలోభాలకు తలోoచకుండా చంద్రకాంత్ పై జరిగిన దాడిని హత్యయత్య కేసుగా పరిగణించి దాడి చేసిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు ఇందిరా సోమరాజు, నాయకులు చల్లా వేణుధర్ రెడ్డి, యుగేందర్, సందీప్ రెడ్డి, ప్రభాకర్, నర్సయ్య, సత్యనారాయణ, లింగమూర్తి పాల్గొన్నారు.