లక్నో: విడాకుల వివాదం నేపథ్యంలో భార్యపై కాల్పులు జరిపి భర్త హత్య చేశాడు. (Man Shoots Wife Dead) ఆమె తన డబ్బును తినేస్తున్నదని ఆరోపించాడు. భార్యను చంపినందుకు ఎలాంటి బాధలేదని పోలీసులకు చెప్పాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 34 ఏళ్ల విశ్వకర్మ చౌహాన్, 32 ఏళ్ల మమతకు 14 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి 13 ఏళ్ల కుమార్తె ఉన్నది. అయితే భర్త వేధింపులు, వివాహేతర సంబంధం ఆరోపణలపై భార్య మమత విడాకుల కోసం కోర్డును ఆశ్రయించింది. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఆమె తన కుమార్తెతో కలిసి విడిగా నివసిస్తున్నది. భరణంతో పాటు కుమార్తె సంరక్షణ కోసం డబ్బు, వ్యవసాయ భూమిని తన పేరు మీద బదిలీ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నది.
కాగా, బుధవారం రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలోని ఒక షాపు వద్ద విడాకుల వివాదంపై భార్య మమతతో విశ్వకర్మ గొడవపడ్డాడు. ఈ సందర్భంగా ఆగ్రహంతో తన వెంట తెచ్చిన పిస్టల్‌తో ఆమెపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన మమతను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మమతను కాల్చి చంపిన విశ్వకర్మను అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా విడాకుల వివాదం నేపథ్యంలో తన డబ్బును భార్య తినేస్తున్నదని ఆరోపించాడు. భార్యను కాల్చి చంపడంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నాడు. దీంతో కుమార్తె ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A man shot his wife dead on Wednesday night after an argument near a photo studio in Gorakhpur. The incident occurred around 8 pm when the woman had gone to the studio for photographs.
According to police, locals rushed the blood-soaked woman to a private hospital, where doctors… pic.twitter.com/hXMlWpRKEV
— IndiaToday (@IndiaToday) September 4, 2025
Also Read:
Fake IAS Officer | నకిలీ ఐఏఎస్ అధికారి గుట్టురట్టు.. పలు లగ్జరీ కార్లతో బిల్డప్
Indian Wins Rs 35 Crore Jackpot | యూఏఈలో.. రూ.35 కోట్ల లాటరీ గెలుచుకున్న భారతీయుడు
Watch: బెడిసికొట్టిన మంటలు ఊదే స్టంట్.. ఏం జరిగిందంటే?