భోపాల్: నోటితో మంటలు ఊదే స్టంట్ బెడిసికొట్టింది. (Fire Blow Stunt) ఇద్దరు వ్యక్తులకు మంటలు అంటుకున్నాయి. దీంతో వారిద్దరికి కాలిన గాయాలయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి గణేష్ విగ్రహం నిమజ్జనం సందర్భంగా ఇద్దరు యువకులు వాహనంపై స్టంట్లు చేశారు. నోటితో మంటలు ఊదే కళాకారుడైన యువరాజ్ మర్మత్ తన నోటిలో పెట్రోల్ పోసుకున్నాడు. మండుతున్న కర్రపై పెట్రోల్ ఉమ్మి అగ్నిగోళాన్ని సృష్టించాడు.
కాగా, ఈ స్టంట్ బెడిసికొట్టింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు యువరాజ్ దుస్తులకు అంటుకున్నాయి. దీంతో అతడి చేతులు, ఛాతీ, ముఖానికి కాలిన గాయాలయ్యాయి. యువరాజ్ పక్కన ఉన్న మరో వ్యక్తికి కూడా మంటలు అంటుకున్నాయి. వారిద్దరూ వెంటనే వాహనం నుంచి కిందకు దూకారు.
మరోవైపు మంటలు చూసిన జనం తొలుత ఏం జరుగుతున్నదో తెలియక గొందరగోళానికి గురయ్యారు. మంటల వల్ల కాలిన గాయాలైన ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఒక వ్యక్తికి 36 శాతం మేర కాలిన గాయాలయ్యాయని డాక్టర్ తెలిపారు. కుటుంబ సభ్యులు అతడ్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే వారిద్దరికి ప్రాణాపాయం లేదన్నారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मध्य प्रदेश | उज्जैन में आग से स्टंट दिखाने के दौरान हुआ हादसा, दो युवक झुलसे #MadhyaPradesh #Ujjain #Fire #Viralvideo pic.twitter.com/rSIwEVSlH2
— Vistaar News (@VistaarNews) September 4, 2025
Also Read:
Indian Wins Rs 35 Crore Jackpot | యూఏఈలో.. రూ.35 కోట్ల లాటరీ గెలుచుకున్న భారతీయుడు
MP Judge Gets Rs 5 Billion Threat | బతకాలంటే ఐదు బిలియన్లు ఇవ్వు.. జడ్జీకి బెదిరింపు లేఖ