హైదరాబాద్, ఆట ప్రతినిధి : గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఆతిథ్య భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన గ్రూపు-బీ తొలి పోరులో భారత్ 4-0 తేడాతో ఉరుగ్వేపై ఘన విజయం సాధించింది.
మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్ఇండియా తరఫున సునెలిటా తొపో(21ని), ఇషిక(40ని), లాల్రెసియామి(49ని), రుతుజా దాదాసో(58ని) గోల్స్ చేశారు. మ్యాచ్లో ఆది నుంచే టీమ్ఇండియా స్ట్రైకర్లు దూకుడు కనబరిచారు.