కన్నతండ్రే కడతేర్చాడు!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదృశ్యమైన ముగ్గురు పిల్లల మృతదేహాలు చెరువులో లభ్యం కాగా.. వారిని హత్యచేసింది కన్నతండ్రేనని పోలీసులు తెలిపారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆదివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
- ముగ్గురు కూతుళ్లను పోషించలేక హత్య
- నిందితుడి అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు
కామారెడ్డి, మార్చి 8 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదృశ్యమైన ముగ్గురు పిల్లల మృతదేహాలు చెరువులో లభ్యం కాగా.. వారిని హత్యచేసింది కన్నతండ్రేనని పోలీసులు తెలిపారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆదివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీనగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సీపాత్ (8), అయాత్ (7), మరియం (5) శనివారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లి, తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఎస్పీ రాజేశ్చంద్ర ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టిన పోలీసులు ..పిల్లలను ఎక్కడికి తీసుకెళ్లారో సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. పరారీలో ఉన్న తండ్రి ఇస్మాయిల్‌ను ఆదివారం అదుపులోకి తీసుకొని విచారించగా.. అప్పులు, ఆర్థిక భారంతో తానే ముగ్గురు పిల్లలను కామారెడ్డి పెద్ద చెరువులో తోసేసినట్టు ఒప్పుకున్నాడు.
గజఈతగాళ్ల సాయంతో అయాత్, మరియం, సీపాత్ మృతదేహాలను వెలికితీసి, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్ పంపినట్టు ఎస్పీ తెలిపారు. అలాగే ఈ నెల 6న అదృశ్యమైన గోసంగి కాలనీకి చెందిన ఇద్దరు పిల్లల జాడను త్వరలోనే గుర్తిస్తామని చెప్పారు. సమావేశంలో పట్టణ, రూరల్ సీఐలు నరహరి, రామన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

