MP Judge Gets Rs 5 Billion Threat | బతకాలంటే ఐదు బిలియన్లు ఇవ్వు.. జడ్జీకి బెదిరింపు లేఖ
MP Judge Gets Rs 5 Billion Threat | మహిళా న్యాయమూర్తికి బెదిరింపు లేఖ అందింది. బతికి ఉండాలంటే ఐదు బిలియన్లు (రూ.500 కోట్లు) ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. బందిపోటు నాయకుడు హనుమాన్ ముఠా సభ్యుడి పేరుతో అందిన స్పీడ్ పోస్ట్ కలకలం రేపింది.
భోపాల్: మహిళా న్యాయమూర్తికి బెదిరింపు లేఖ అందింది. బతికి ఉండాలంటే ఐదు బిలియన్లు (రూ.500 కోట్లు) ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. (MP Judge Gets Rs 5 Billion Threat) బందిపోటు నాయకుడు హనుమాన్ ముఠా సభ్యుడి పేరుతో అందిన స్పీడ్ పోస్ట్ కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తియోంథార్లోని మొదటి సివిల్ జడ్జి మోహినీ భడోరియాకు ఒక స్పీడ్ పోస్ట్ అందింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి పంపిన అందులో బెదిరింపు లేఖ ఉన్నది. ‘నువ్వు బతికి ఉండాలనుకుంటే ఐదు బిలియన్లు (రూ.500 కోట్లు) చెల్లించాలి. సెప్టెంబర్ 1న సాయంత్రం 7:45 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని బద్గడ్ అడవిలో ఆ డబ్బు అందజేయాలి. దీనిని విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని ఆ లేఖ ద్వారా హెచ్చరించారు. గతంలో మధ్య భారత్‌ను ఠారెత్తించిన చంబల్ బందిపోటు నాయకుడు ‘హనుమాన్ ముఠా’కు విధేయుడిగా పేర్కొన్న వ్యక్తి సంతకం ఉన్నది.
కాగా, జడ్జీకి అందిన ఈ బెదిరింపు లేఖ కోర్టులో కలకలం రేపింది. ఇది చూసి న్యాయమూర్తి మోహినీ భడోరియా షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ వెంటనే స్పందించారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన ఒక అనుమానితుడిని గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను పంపారు. అలాగే రేవాలోని కోర్టులు, న్యాయమూర్తుల భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read:
Kukis agree to reopen NH-2 | జాతీయ రహదారి 2ను తెరిచేందుకు కుకీలు అంగీకారం.. మణిపూర్‌లో శాంతికి ఊతం
Car Rams Truck | వేగంగా లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు వ్యాపారులు మృతి
Watch: దూకాలని సవాల్ చేసిన భర్త.. మేడ పైనుంచి కిందకు దూకిన భార్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

