లక్నో: ఒక మహిళ మేడ పైకి ఎక్కింది. అయితే అక్కడి నుంచి దూకాలని ఆమె భర్త సవాల్ చేశాడు. దీంతో ఆ మహిళ మేడ పైనుంచి కిందకు దూకింది. (Woman Jumps Off Roof) తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిపాలయ్యింది. ఈ నేపథ్యంలో అదనపు కట్నం వేధింపులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోండా ప్రాంతంలోని డకౌలి గ్రామంలో అత్తవారింట్లో నివసించే అర్చనకు ఆరేళ్ల కిందట సోనుతో వివాహం జరిగింది. ఆ దంపతులకు నాలుగు, రెండేళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు.
కాగా, అత్తింటి వారు అదనపు కట్నం కోసం అర్చనను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న భర్తతో ఆమెకు గొడవ జరిగింది. మనస్తాపం చెందిన అర్చన రెండు అంతస్తుల మేడ పైకి ఎక్కింది. అయితే అక్కడి నుంచి కిందకు దూకాలని భర్త సోను పలుమార్లు అన్నాడు. దీంతో అర్చన మేడ పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను భర్త కొట్టాడు. అనంతరం అర్చనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న అర్చన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి సమయంలో సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపాడు. అయితే అత్తమామలు రూ.5 లక్షలు అదనపు కట్నం, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ డిమాండ్ చేస్తున్నారని, అర్చనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సోను సోదరుడు ప్రమోద్ అర్చనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించాడు.
కాగా, ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న అర్చన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. దీని ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలపారు. పొరుగింటి వ్యక్తి మొబైల్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In Uttar Pradesh’s Aligarh, a woman harassed by her husband & in-laws over dowry jumped from the first floor of her house. After falling face down and critically injuring herself, a man was seen thrashing her on the ground, in front of children.@Uppolice pic.twitter.com/jyHoflM6Og
— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeeer) September 3, 2025
Also Read:
Vasundhara Raje | ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో.. వసుంధర రాజే రహస్య సమావేశం
Cops Suspended | జపాన్ టూరిస్ట్ నుంచి లంచం తీసుకున్న పోలీసులు.. వీడియో వైరల్‌తో సస్పెండ్