కోల్కతా: అపార్థం కారణంగా అత్యాచారం జరిగినట్లుగా ఫిర్యాదు చేసినట్లు కోర్టుకు మహిళ తెలిపింది. అతడితో తనకు శారీరక సంబంధం ఉన్నట్లు చెప్పింది. దీంతో ఈ కేసులో అరెస్టై 51 రోజులు జైలులో ఉన్న వ్యక్తి నిర్దోషిగా విడుదలయ్యాడు. (Man Acquitted In Rape Case) పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. 2017 నుంచి మహిళకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని అతడు హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కోల్కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలోని హోటల్లో వారిద్దరూ ఒకరాత్రి గడిపారు. ఈ సందర్భంగా శారీరకంగా కలిశారు.
కాగా, ఆ మరునాడు పెళ్లి చేసుకోబోనని ఆ వ్యక్తి అన్నట్లు మహిళ ఆరోపించింది. అనంతరం అక్కడి నుంచి అతడు పారిపోయాడని తెలిపింది. తనపై అత్యాచారం చేశాడని ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 2020 నవంబర్ 25న ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2021 జనవరి 14న కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు 51 రోజుల పాటు జైలులో ఉన్నాడు. తాను నిర్దోషినని కోర్టులో వాదించాడు.
మరోవైపు కోల్కతాలోని ఫాస్ట్ ట్రాక్ 2వ కోర్టు ఈ కేసుపై విచారణ జరిపింది. అయితే ఆ వ్యక్తితో శారీరక సంబంధం ఉన్నట్లు ఆ మహిళ కోర్టుకు తెలిపింది. కొంత అపార్థం కారణంగా అతడిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. ఫిర్యాదు లేఖను తన స్నేహితురాలు రాసిందని, అందులోని విషయాలు తెలియకుండానే తాను సంతకం చేసినట్లు పేర్కొంది. తనకు మరేమీ గుర్తులేదని కోర్టుకు వెల్లడించింది.
కాగా, ఇద్దరి ఏకాభిప్రాయంతో వారి మధ్య లైంగిక సంబంధం ఏర్పడినట్లు కోర్టు భావించింది. అత్యాచారం, మోసం సెక్షన్ల కింద ఆ వ్యక్తిపై మోపిన అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు కోర్టు పేర్కొంది. దీంతో ఆ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది. ఆగస్ట్ 28న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
Also Read:
Woman’s Severed Head | కలకలం రేపిన తెగిన మహిళ తల.. భర్త అరెస్ట్
I’m your husband’s 2nd wife | నీ భర్తకు రెండో భార్యనంటూ ఫోన్.. బస్సులో కుప్పకూలి మహిళ మృతి
Raghav Chadha | ‘పంజాబ్ డబ్బు పంజాబ్ ప్రజలకే’.. రూ.3.25 కోట్ల నిధులు ప్రకటించిన రాఘవ్ చద్దా