లక్నో: ఒక మహిళకు తన భర్త మొబైల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నీ భర్త రెండో భార్యనని ఒక మహిళ చెప్పింది. (I’m your husband’s 2nd wife) ఇది విన్న ఆమె షాక్ అయ్యింది. తల్లి, సోదరుడితో కలిసి బస్సులో సొంతూరుకు బయలుదేరింది. అయితే తీవ్ర మానసిక క్షోభ వల్ల కుప్పకూలి మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని జలాల్పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల రీటాకు సీతాపూర్ జిల్లాలోని బనియా మౌ గ్రామానికి చెందిన శైలేంద్రతో రెండేళ్ల కిందట వివాహమైంది. పెళ్లి జరిగిన కొద్దికాలానికే ఆమెకు క్షయవ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్స కోసం పుట్టింటికి చేరుకున్నది. కోలుకున్న తర్వాత అత్తమామల ఇంటికి తిరిగి వెళ్లింది.
కాగా, ఈ ఏడాది మే నెలలో రీటా తండ్రి మరణించాడు. దీంతో తన స్వస్థలమైన జలాల్‌పూర్‌కు ఆమె తిరిగి వచ్చింది. ఆ సమయంలో భర్తతో విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తల్లి, సోదరుడితో కలిసి ఢిల్లీకి మకాం మార్చింది. అయితే ఆగస్ట్ 26న భర్త మొబైల్ ఫోన్ నుంచి రీటాకు కాల్ వచ్చింది. ఒక మహిళ ఆమెతో మాట్లాడింది. ఆమె భర్త రెండో భార్యనని చెప్పింది.
మరోవైపు ఈ ఫోన్ కాల్‌తో రీటా షాక్ అయ్యింది. తల్లి, సోదరుడితో కలిసి ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సొంతూరుకు బస్సులో ప్రయాణమైంది. పక్కన కూర్చొన్న తల్లి ఒడిలో చాలా సేపు ఏడ్చింది. తనకు అసౌకర్యంగా ఉన్నట్లు తల్లితో చెప్పింది. ఫోన్ తర్వాత నుంచి అనుభవిస్తున్న మానసిక క్షోభ వల్ల కుప్పకూలి బస్సులో మరణించింది.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని అత్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ధికున్ని గ్రామం సమీపంలో ఈ సంఘటన జరిగింది. దీంతో రీటా సోదరుడి ఫిర్యాదుతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా ఈ కేసుపై దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Black Magic | మొరాయించిన మ్యూజిక్ సిస్టమ్.. చేతబడి అనుమానంతో దంపతులపై దాడి, వ్యక్తి మృతి
Minister Chased By Locals | మంత్రిపై దాడికి జనం యత్నం.. కిలోమీటరు దూరం వరకు వెంబడించిన వైనం
Woman Gives Birth To 17th Child | 55 ఏళ్ల వయస్సులో.. 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ