Sukhoi Crash: అస్సాంలో కూలిన సుఖోయ్.. ఇద్దరు పైలెట్లు మృతిచెందినట్లు ఐఏఎఫ్ నిర్ధారణ
Sukhoi Crash: సుఖోయ్ ఎస్‌యూ-30 ఎంకేఐ ఫైటర్ జెట్ అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో కూలింది. ఆ ప్రమాదంలో మృతిచెందిన పైలెట్లను స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లయిట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దుర్గాకర్‌గా గుర్తించారు. ఆ పైలెట్ల మృతి పట్ల భారతీయ వైమానిక దళం సంతాపం ప్రకటించింది.
న్యూఢిల్లీ: సుఖోయ్ ఎస్‌యూ-30 ఎంకేఐ ఫైటర్ జెట్ కూలినట్లు(Sukhoi Crash) భారతీయ వైమానిక దళం ప్రకటించింది. ఆ ప్రమాదంలో ఇద్దరు వైమానిక దళ పైలెట్లు మృతిచెందినట్లు ఐఏఎఫ్ కన్ఫర్మ్ చేసింది. అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ కూలింది. ప్రమాదంలో మృతిచెందిన పైలెట్లను స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లయిట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దుర్గాకర్‌గా గుర్తించారు. ఐఏఎఫ్ దళ సభ్యులందరూ ఆ పైలెట్ల మృతి పట్ల సంతాపం చెబుతున్నారని ఐఏఎఫ్ తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించింది. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
ట్రైనింగ్ మిషన్‌లో భాగంగా గురవారం సుఖోయ్-ఎస్‌యూ-30 ఎంకేఐ యుద్ధ విమానం గగనతలంలోకి ఎగిరింది. అయితే జోర్హాట్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఆ విమానం రేడార్ నుంచి అదృశ్యమైంది. ఎయిర్‌బేస్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో సుఖోయ్ యుద్ధ విమానం కూలినట్లు గుర్తించారు. రాత్రి 7.42 నిమిషాలకు ఆ విమానంతో కమ్యూనికేషన్ దెబ్బతిన్నది. సమీప కొండ ప్రాంతంలో కూలినట్లు తేల్చారు. కొండ మీద నుంచి భారీ స్థాయిలో శబ్ధం వచ్చినట్లు స్థానిక గ్రామస్తులు తెలిపారు. మంటలు కూడా వ్యాపించినట్లు చెప్పారు.
సుఖోయ్ ఎస్‌యూ-30 ఎంకేఐ ఫైటర్ జెట్.. టూ సీటర్ ఇంజిన్. రష్యా విమాన తయారీ కంపెనీ సుఖోయ్ దీన్ని డెవలప్ చేసింది. లాంగ్ రేంజ్ ఫైటర్ జెట్‌గా దీన్ని గుర్తించారు. ప్రస్తుం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీ లైసెన్సు కింద ఆ యుద్ధ విమానాన్ని నిర్మిస్తున్నారు.
IAF acknowledges the loss of Sqn Ldr Anuj and Flt Lt Purvesh Duragkar, who sustained fatal injuries in the Su-30 crash. All personnel of the IAF express sincere condolences, and stand firmly with the bereaved family in this time of grief.@DefenceMinIndia@SpokespersonMoD… pic.twitter.com/zUtfUJ2ewr
— Indian Air Force (@IAF_MCC) March 6, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

