Health Tips | ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలో కాల్షియం లోపిస్తుందా..?
Health Tips | ఉప్పు (Salt) మన రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండే పదార్థం. ఏ వంటలోనైనా ఉప్పు లేకపోతే అసలు రుచే ఉండదు. అందుకే 'అన్నేసి చూడు.. నన్నేసి చూడు' అని ఉప్పు గర్విస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఉప్పు నాడీవ్యవస్థ (Nerv System) పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే ఈ ఉప్పును అధికంగా తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు (Health Experts) హెచ్చరిస్తున్నారు.
Health Tips : ఉప్పు (Salt) మన రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండే పదార్థం. ఏ వంటలోనైనా ఉప్పు లేకపోతే అసలు రుచే ఉండదు. అందుకే ‘అన్నేసి చూడు.. నన్నేసి చూడు’ అని ఉప్పు గర్విస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఉప్పు నాడీవ్యవస్థ (Nerv System) పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే ఈ ఉప్పును అధికంగా తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు (Health Experts) హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవడం ఆరోగ్యకరం. అధిక ఉప్పు వాడకం రక్తపోటును పెంచుతుంది. గుండె సమస్యలకు, కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా అధికంగా ఉప్పు తీసుకోవడంవల్ల శరీరంలో ఉన్న కాల్షియం మూత్రం ద్వారా ఎక్కువగా బయటకు వెళ్తుంది. దాంతో కాల్షియం లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాల్షియం ఎముకలు, దంతాల బలానికి చాలా అవసరం. కాబట్టి ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కాల్షియం తగ్గి, ఎముకల బలహీనతకు దారితీస్తుంది.
ఈ ఎముకల బలహీనత అనేది ముఖ్యంగా ఇప్పటికే కాల్షియం లోపం ఉన్నవారిలో, వృద్ధుల్లో, మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ సమస్య ఉన్నవాళ్లు ఉప్పును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. అదేవిధంగా పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. సరైన ఆహార అలవాట్లు పాటిస్తే ఉప్పువల్ల వచ్చే కాల్షియం లోపాన్ని తగ్గించుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

